Healthy Home Remedies for Hair | Beauty Tips | Haircare Healthy tips | Amla Beauty tips

Haircare healthy tips amla beauty home remedies beauty tips

haircare tips, healthy home remedies, hair home remedies, healthy hair tips, haircare remedies, haircare food items, healthy food items, hair healthy foods, hair healthy tips

Haircare Healthy tips Amla Beauty Home Remedies beauty tips : Healthy home remedies for hair to get rid off hair falling problems and many more.

జుట్టును సంరక్షించే ఇంటిచిట్కాలు

Posted: 05/15/2015 01:06 PM IST
Haircare healthy tips amla beauty home remedies beauty tips

సాధారణంగా కొన్ని సందర్భాల్లో ప్రతిఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. జుట్టు పొడిబారిపోవడం, రాలిపోవడం, త్వరగా తెల్లబడటం, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు వస్తుంటాయి. సమయానికి పోషకాహారం తీసుకోకపోవడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ రకమైన సమస్యలు తలెత్తుతాయి. తద్వారా కేశాల బలహీనపడిపోయి, సౌందర్యాన్ని పూర్తిగా తగ్గించేస్తాయి. ఇలా కాకుండా జుట్టు సమస్యలను అధిగమించాలంటే బ్యూటీషియన్స్ కొన్ని ఇంటి చిట్కాలను అందజేస్తున్నారు. వాటిని తరుచూ పాటిస్తే.. జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యకరమైన, కాంతివంతంగా మెరిసే కేశాలను సొంతం చేసుకోవచ్చు.

జుట్టును సంరక్షించే ఇంటిచిట్కాలు :

* దుమ్ము, ధూళి పేరుకుపోయి ఒక్కోసారి జుట్టు నిస్సారంగా తయారవుతుంటుంది. అలాంటప్పుడు గోరింటాకు రుబ్బి, అందులో బీట్ రసాన్ని కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత కుంకుడుకాయ రసంతో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే వెంట్రుకలు ప్రకాశవంతంగా తయారవుతాయి.

* ఉసిరికాయల్ని బాగా ఎండబెట్టి వాటిని, కొన్ని కుంకుడు కాయల్నీ, శీకాయల్ని ఒక పాత్రలో వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంలో నీళ్లు కలిపి.. నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఈ మిశ్రమంతో మాడునీ, వెంట్రుకల్నీ శుభ్రం చేసుకుంటే మురికి మొత్తం పోతుంది. ఈ పేస్టును షాంపూల్లా కూడా వాడుకోవచ్చు.

* ఒక పాత్రలో కాస్త ఉసిరి పొడికి తీసుకుని అందులో నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకి రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేయవచ్చు.

* వగరుగా ఉండే ఉసిరి జుట్టుకెంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి  పుష్కలంగా ఉంటుంది. అది వెంట్రుకల కుదుళ్లకు దృఢంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.

* ఉసిరి రసాన్ని హెన్నాలో కలిపి తలకు పెట్టుకుంటే ఎంతో శ్రేయస్కరం. అలా చేస్తే జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాదు.. జుట్టుకు కావాల్సిన పోషకాలూ అందుతాయి. తెల్లగా వుండే జుట్టు నల్లరంగులోకి మారుతాయి.

* ఒక గిన్నెలో కొబ్బరినూనె తీసుకుని అందులో వెల్లుల్లి పాయలను వేసి కొద్దిసేపు ఉడికించాలి. అనందాన్ని ఆ మిశ్రమాన్ని వడకట్టి, నూనెను సీసాలో నిల్వ చేసుకుని రోజూ రాసుకుంటూ ఉంటే వెంట్రుకలు క్రమంగా నల్లబడిపోతాయి.

* జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే.. ఉల్లిపాయను మెత్తని పేస్ట్‌లా చేసి, దానిలో కాస్త తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. కొన్నాళ్లపాటు వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haircare tips  hair home remedies  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more