Best Beauty Face Packs for Oily and Sensitive Skins | Beauty Home Remedies | Beauty Tips

Beauty face packs oily skin sensitive skin home remedies

beauty face packs, beauty tips, beauty home remedies, beauty tips telugu, oily skin beauty tips, sensitive skin beauty tips, oily skin beauty pack, sensitive skin beauty pack, beauty packs, skin problems, smooth skin problems

Beauty Face packs oily skin Sensitive skin Home remedies : The Best Beauty Face Packs to get rid off Oily and Sensitive Skins problems.

జిడ్డు చర్మానికి చక్కటి ఫేస్ ప్యాక్

Posted: 04/28/2015 03:07 PM IST
Beauty face packs oily skin sensitive skin home remedies

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్మసౌందర్యం కూడా మారుతుంది. కాలానికి అనుగుణంగా చర్మం పొడిబారిపోవడం, నల్లగా మారడం, జిడ్డుగా తయారవడం, చాలా సున్నితంగా మారిపోవడం, ముసలివారిలా కనిపించేలా చర్మం అందవిహీనంగా మారిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. వీటికి అనుగుణంగానే మార్కెట్ లో ఎన్నోరకాల చర్మసౌందర్యాలు లభ్యమవుతుంటాయి కానీ.. వాటికంటే ఆయుర్వేద చికిత్సే ఎంతో అద్భుతంగా పనిచేస్తోంది. అంటే.. ఎన్నోరకాల పదార్థాలతో రకరకాల స్కిన్ ప్యాక్, ఫేస్ ప్యాక్, ఇతర రెమెడీలను తయారుచేసుకుని.. చర్మ సమస్యలను చెక్ పెట్టవచ్చు.

ప్రస్తుతం జిడ్డు చర్మం గురించి మాట్లాడుకుంటే.. ఈ సమస్యలను బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఫేస్ ప్యాక్ లతోనే అధిగమించవచ్చు. ఈ సాధారణ పదార్థాలతో తయారయ్యే ఈ ఫేస్ ప్యాక్ లో చర్మానికి కావాలసిన పోషకాలు నిల్వవుంటాయి. అవి తక్షణమే చర్మంపై ప్రభావం చూపిన క్రమంలో వెంటనే మార్పును గమనించవచ్చు. అలాగే సున్నితమైన చర్మానికీ ఫేస్ ప్యాక్ లు అందుబాటులో వున్నాయి. మరి.. వాటిని ఎలా చేస్తారో.. వాటి పనితీరు ఎలా వుంటుందో తెలుసుకుందామా..

జిడ్డు చర్మానికి ఫేస్ ప్యాక్ : ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో రెండు చెంచాల ముల్తానీ మట్టి, చెంచా మొక్కజొన్న పిండీ, రెండు చెంచాల కీరదోస పొడి వేసి.. అన్నింటిని కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఏదైనా ఓ చోట భద్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖానికి వేసుకోవాలనుకున్నప్పుడు.. ద్రాక్షరసంతో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత దానిని ముఖానికి పూతలా రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసుకుంటే.. జిడ్డు చర్మం నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

సున్నిత చర్మానికి ఫేస్ ప్యాక్ : ఒక గిన్నెలో రెండు చెంచాల పాల పొడి, రెండు చెంచాల గోధుమ రవ్వా, రెండు చెంచాల మొక్కజొన్న పిండీ, చెంచా ముల్తానీ మట్టీ వేసి.. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా ఓ చోట భద్రపరుచుకోవాలి. దీనిని ముఖానికి వేసుకోవాలనుకున్నప్పుడు.. కొద్దిగా పొడి తీసుకుని అందులో బొప్పాయి లేదా పుచ్చకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. సున్నిత చర్మం నుంచి ఉపశమనం పొంది, మృదువైన చర్మాన్ని పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oily Skin Beauty Packs  Sensitive skin tips  beauty tips  beauty face packs  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more