Beauty tips for face to get fresh look

beauty tips, healthy beauty tips, simple beauty tips, home remedis for face, home remedis beauty tips, beauty tips for face, skin beauty tips, fresh looking beauty tips

simple beauty tips for face to get fresh look and glow skn

క్షణాల్లో ముఖం మెరిసిపోవాలా..?

Posted: 09/22/2014 04:39 PM IST
Beauty tips for face to get fresh look

ప్రస్తుతకాలంలో మహిళలందరూ రోజువారి గృహకార్యకలాపాలు నిర్వహించుకోవడంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో సౌందర్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆఫీసుకు వెళ్తున్న సమయంలో బయట వాతావరణ కాలుష్యం వల్ల ధుమ్ము, ధూళి అంత ముఖం మీద పేరుకుపోయి జిడ్డుగా మారిపోతుంది. అలాగే ఇంట్లో చేసే పనులతో చెమట విసర్జించి దుర్వాసనను కలిగించడమే కాకుండా చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలోనే ముఖం సౌందర్యం అందవిహీనంగా తయారవ్వడంతోపాటు మచ్చలు కూడా ఏర్పడుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖాన్ని కాంతివంతగా, సౌందర్యంగా మార్చుకోవాలంటే నిత్యం క్లీనర్స్ తో శుభ్రపరుచుకోవడం ఎంతో అవసరం. క్లీన్సర్ వల్ల చర్మ రంథ్రాలు శుభ్రపడి చర్మపు సహజ నూనెలు స్రవిస్తాయి. ఫలితంగా ముఖ చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.

ముఖానికి సంబంధించిన క్లీనర్స్ మార్కెట్లో ఎన్నో లభ్యమవుతాయి. కానీ వాటిలో రసాయనాల గాఢత ఎక్కువగా వుండటంతో అవి చర్మంపై వుండే మురికితోపాటు చర్మపు సహజనూనెలను కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, సాఫ్ట్ గా వుండదు. అలా కాకుండా వుండాలంటే.. కొన్ని సహజ పదార్థాలతో మనం ఇంట్లోనే క్లీనర్స్ ను తయారుచేసుకోవచ్చు. వీటిని నిత్యం సమయానుకూలంగా ముఖానికి రాసుకుంటే.. కాంతివంతమైన అందాన్ని పొందడంతోపాటు చర్మం మృదువుగా, చాలా సాఫ్ట్ గా వుంటుంది. మరి ఆ క్లీనర్స్ ను ఎలా తయారుచేసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాం..

1. పాలు సహజసిద్ధమైన క్లీన్సర్. నిద్రకు ముందు పచ్చి పాలలో దూది ముంచి ముఖం, మెడకు రుద్దుకోవాలి. ఆరిన తర్వాత మళ్లీ రిపీట్ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరనిచ్చి, చల్లని నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.

2. నూనె చర్మానికి : శనగపిండి, పచ్చిపాలు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.

3. పొడి చర్మానికి : తేనె, పెరుగులతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. తేనె, పెరుగులు మాయిశ్చరైజర్‌లా పని చేసి పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

4. నార్మల్ స్కిన్ : దోసకాయ తరుగుతో ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. లేదా దోస రసం, పెరుగు సమపాళ్లలో కలుపుకుని ముఖానికి అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

5. అన్ని చర్మ తత్వాలు : అన్ని రకాల చర్మ తత్వాలకు సూటయ్యే క్లీన్సర్...రోజ్ వాటర్. రాత్రి నిద్రకు ముందు రోజ్‌వాటర్‌ను ముఖం మొత్తం అద్దుకుని పడుకుంటే తెల్లారేసరికి చర్మం మృదువుగా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  home remedis skin  fresh looking skin tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more