Defections Not Our Motive says CM KCR | ఫిరాయింపుల కోసం కాదు.. రాజకీయ సుస్థిరత కోసమే...

Cm kcr on defections to trs

Telangana, CM KCR, Political Stability, Defections, Assembly Session, TS Budget Sessions, TS Assembly Sessions, KCR Political Stability

Telangana CM KCR on Defections in Assembly. KCR says for Political stability Can only Possible with that only.

రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

Posted: 03/14/2018 02:56 PM IST
Cm kcr on defections to trs

రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు.

తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే.. రాజకీయ సుస్థిరత కూడా అంతే ముఖ్యమని భావించామని, అంతేగానీ ఫిరాయింపులు తమ ప్రధాన ఉద్దేశం కాదని ఆయన వెల్లడించారు. టెండర్లలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని.. కానీ, వాటిని నిరూపించలేకపోయానని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ ఉంటుందా అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఇంకా ఘోరంగా మాట్లాడారని కెసిఆర్ గుర్తు చేసుకొన్నారు. ఆనాడు తమ పార్టీకి చెందిన ఎంపీ విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నారని కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం విజయశాంతి ఎక్కడుందన్నారు. విజయశాంతిని అడవులకు పంపారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తెలంగాణను అభివృద్ధి చేసుకోవటమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు పని చేస్తున్నాయన్నారు. గతంలో సచివాలయంలో పైరవీ ముఠాలు యథేచ్ఛగా ఉండేవని.. ఇప్పుడు ఎలాంటి అవినీతి కనిపించటం లేదన్నారు.

* మిషన్ కాకతీయ కింద 17 వేల చెరువులు బాగుపడ్డాయని తెలిపారు
* పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం.
* చాలా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.
* తెలంగాణలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kamal haasan on periyar statue vandalism

  విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

  Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

 • Ysrcp adi sheshagiri rao comments on cbn

  చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

  Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more

 • Anantapur mayor fire on jc diwakar

  జేసీపై మండిపడ్డ అనంత మేయర్

  Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more

 • Rahul gandhi about gujarat development

  గుజరాత్ కు మోదీ చేసిందేంటి? : రాహుల్ గాంధీ

  Nov 29 | గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీపై విభిన్న రీతిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాలతో మోదీకి చుర‌క‌లు అంటిస్తూ గుజరాతీలను ఆకట్టుకునే యత్నం... Read more

 • Ap dgp complained about lakshmi parvathi

  లక్ష్మీపార్వతిపై డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

  Nov 15 | వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందని... తనను రక్షించాలని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతినేని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీ సాంబశివరావును కలసి ఫిర్యాదు చేశారు.... Read more

Today on Telugu Wishesh