Anantapur Mayor Fire on MP JC Diwakar | 50 ఫైసలైన ఖర్చు పెట్టావా? అంటూ జేసీపై మేయర్ ఫైర్

Anantapur mayor fire on jc diwakar

Anantapur, Mayor Swaroopa, JC Diwakar Reddy, JC Diwakar Reddy Anantapur, MP JC Diwakara Reddy, JC Anantapur Develop, JC Diwakar Reddy Retirement

Anantapur Mayor Swaroopa on Wednesday breathed fire on TDP MP JC Diwakar Reddy for allegedly obstructing the development of Anantapur. "Though we have done development works with hundreds of crores, JC Diwakar Reddy who wears black spectacles is unable to see them. Better if he wears white glasses."He has not even spent 50 paise for the development of Anantapur. "Instead of obstructing good work, JC Diwakar Reddy must focus on serving the people and retiring from politics,' the Mayor asserted.

జేసీపై మండిపడ్డ అనంత మేయర్

Posted: 12/20/2017 04:25 PM IST
Anantapur mayor fire on jc diwakar

అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని, వంద కోట్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా ఆయనకు కనబడటం లేదని విమర్శించారు.

జేసీ తన నల్ల కళ్లద్దాలను తీసి తెల్ల అద్దాలను పెట్టుకుని చూస్తే ఆ అభివృద్ధి పనులు కనబడతాయని ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చుట్టపుచూపుగా మూడు నెలలకొకసారి అనంతపురం వచ్చే జేసీ తాము చేసిన అభివృద్ధి పనుల వైపు కన్నెత్తి కూడా చూడరని అన్నారు.

పైగా, తాము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని, ఇప్పటికైనా మంచి పనులు చేయాలని, జేసీ రాజకీయాలకు గుడ్ బై చెబితే మంచిదంటూ ఆమె ఓ సలహా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more

  • Rahul gandhi about gujarat development

    గుజరాత్ కు మోదీ చేసిందేంటి? : రాహుల్ గాంధీ

    Nov 29 | గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీపై విభిన్న రీతిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాలతో మోదీకి చుర‌క‌లు అంటిస్తూ గుజరాతీలను ఆకట్టుకునే యత్నం... Read more

  • Ap dgp complained about lakshmi parvathi

    లక్ష్మీపార్వతిపై డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

    Nov 15 | వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందని... తనను రక్షించాలని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతినేని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీ సాంబశివరావును కలసి ఫిర్యాదు చేశారు.... Read more

Today on Telugu Wishesh