Kamal Sensational Comments on Periyar Statue Vandalism | పెరియార్ విగ్రహ కూల్చివేతపై కమల్ సంచలన వ్యాఖ్యలు

Kamal haasan on periyar statue vandalism

Kamal Haasan, Periyar Statue Vandalism, Cauvery Water Issue, MNM Party, Kamal Periyar Statue, Statues in India Protection

Kamal Haasan Sensational Comments on Periyar Statue Vandalism. It is An Attempt to Divert Attention from Cauvery Water Issue says Kamal. Vandalism could be an orchestrated event and if they government was serious, they should take action against all involved MNM Chief Demanded.

విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

Posted: 03/07/2018 01:57 PM IST
Kamal haasan on periyar statue vandalism

ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్ విగ్రహాలను పరిరక్షించేందుకు పోలీసులను నియమించాల్సిన అవసరం లేదు. వాటిని తాము కాపాడుకోగలమని ఆయన అంటున్నారు. కావేరీ నిర్వహణ బోర్డు ఏర్పాటు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఈ పని చేస్తున్నారంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు.

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో పెరియార్ రామస్వామి విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు కొందరు గత రాత్రి కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ ఉదయం మీడియాతో కమల్ స్పందిస్తూ.. పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని ద్రవిడ జాతి క్షమించజాలదని ఆయన పేర్కొన్నారు. పెరియార్ విగ్రహాలపై వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రాజాపై చర్యలు అవసరం లేదని అనడం ప్రభుత్వ హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.

రాజా క్షమాపణలు కూడా అంగీకరించకూడదని, ఇది క్షమించరాని నేరమని అన్నారు. బీజేపీ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పెరియార్ విగ్రహాలను తాము కాపాడుకోగలమని, కానీ పెరియార్‌పై అటువంటి ఆలోచన వచ్చినా ద్రవిడ జాతి క్షమించబోదని పేర్కొన్నారు. కావేరీ నదీ జలాల అంశంపై దృష్టి మళ్లించేందుకే పెరియార్‌ విగ్రహాల అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌ రాజా.. పెరియార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెల్లూరులోని ఆయన విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై కొందరు పెట్రో బాంబులు విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Cm kcr on defections to trs

  రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

  Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

 • Ysrcp adi sheshagiri rao comments on cbn

  చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

  Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more

 • Anantapur mayor fire on jc diwakar

  జేసీపై మండిపడ్డ అనంత మేయర్

  Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more

 • Rahul gandhi about gujarat development

  గుజరాత్ కు మోదీ చేసిందేంటి? : రాహుల్ గాంధీ

  Nov 29 | గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీపై విభిన్న రీతిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాలతో మోదీకి చుర‌క‌లు అంటిస్తూ గుజరాతీలను ఆకట్టుకునే యత్నం... Read more

 • Ap dgp complained about lakshmi parvathi

  లక్ష్మీపార్వతిపై డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

  Nov 15 | వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందని... తనను రక్షించాలని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతినేని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీ సాంబశివరావును కలసి ఫిర్యాదు చేశారు.... Read more

Today on Telugu Wishesh