Sujana Chowdary Says Central Govt Will Give Double Special Status To Andhra Pradesh State | TDP party

Sujana chowdary latest press meet ap special status central government

Sujana Chowdary, Sujana Chowdary press meet, ap special status, chandrababu naidu, ysrcp news, telugu desam party, chandrababu delhi tour, Sujana Chowdary special status, ap special package

Sujana Chowdary Latest Press Meet Ap Special Status Central Government : Sujana Chowdary Says Central Govt Will Give Double Special Status To Andhra Pradesh State In His Latest Press Meet

ఏపీకి స్పెషల్ కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్!

Posted: 08/25/2015 01:30 PM IST
Sujana chowdary latest press meet ap special status central government

ఆంధ్రరాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ‘ప్రత్యేక హోదా’ విషయంపై కేంద్రం ఇంకా నోరు మెదపడం లేదు కానీ.. అధికార టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ప్రజల్ని ఊరిస్తున్నారు. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అని నేతలు డప్పు వాయించుకుంటుంటే.. మరోవైపు సీఎం చంద్రబాబు దానికోసం ఢిల్లీకి పర్యటనల మీద పర్యటనలు చేసేస్తున్నారు. కానీ.. ఇంతవరకు ఏమాత్రం రిజల్ట్ లేదు కానీ, స్పెషల్ స్టేటస్ మాత్రం ఖచ్చితంగా వస్తుందంటూ పలు సందర్భాల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి ఆ తరహాలోనే ప్రత్యేక హోదాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన ఆదరణ కేంద్రం నుంచి లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం న్యూఢిల్లీలో వున్న సుజనా.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి స్పెషల్ కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ వస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అనే పదం వాడేందుకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డుగా వున్నాయని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని రాయితీలు, ప్రయోజనాలు వస్తాయో.. వాటన్నిటినీ సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సుజనా తెలియజేశారు. ఈయన ఈ విధంగా మాట్లాడటంపై అప్పుడే భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. నిన్నటివరకు హోదా కచ్చితంగా వస్తుందని చెబుతూ వచ్చిన ఆయన.. నేడు హోదా మాత్రం రాదు కానీ వివిధ ప్యాకేజీలతో కూడిన రాయతీలు వుంటాయని చెప్పకనే చెప్పినట్లయిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. ఈ ప్రత్యేక హోదా సమస్య ఎప్పుడు తీరుతుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sujana Chowdary  Chandrababu Naidu  Ap Special Status  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more