chandrababu naidu fires ysr congress party in mahanadu programme | tdp party news

Chandrababu naidu fires ysr congress party mahanadu programme

chandrababu naidu, ysr congress party, ys jagan mohan reddy, congress party news, ap capital city amaravati, ap state controversies, chandrababu updates, chandrababu controversies, jagan controversies

chandrababu naidu fires ysr congress party mahanadu programme : AP CM Chandrababu Naidu makes controversial comments on ysr congress party and ys jagan in mahanadu programme.

వైకాపా పుట్టుకే అవినీతి పుట్టుక : బాబు

Posted: 05/27/2015 02:05 PM IST
Chandrababu naidu fires ysr congress party mahanadu programme

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైకాపా పార్టీ మీద నిప్పులు చెరిగారు. ఆ పార్టీ పుట్టుకే అవినీతి పుట్టుక అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుంచో అధికారంలో వున్న టీడీపీకి ఇంతవరకు టీడీ ఛానెల్, న్యూస్ పేపర్ లేదని.. కానీ ఆ అవినీతి పార్టీ ఆ రెండు వున్నాయంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇవన్నీ అవినీతి డబ్బుతోనే పెట్టారని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, దోపిడీ చేశారో.. వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. అవినీతి డబ్బంతా కక్కించి.. ప్రజల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. ప్రజల కోసం నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టును వాళ్లస్వార్థం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించారని.. కానీ అక్కడ ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వెనుదిరిగారని చంద్రబాబు పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు.

రాజధాని అంశంలోనూ జగన్ కొత్త నాటకానికి తెరతీశారని బాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం జరగకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని, కోర్టులకు వెళుతూ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు ఎర్ర స్మగ్లింగ్ తో సంబంధాలున్నాయని, అందుకే ఈ విషయంపై వాళ్లు మాట్లాడటం లేదని అన్నారు. స్మగ్లింగ్ తో సంబంధవున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని బాబు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ys jagan mohan reddy  ysr congress party  mahanadu  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more