Minister jana reddy press meet on telangana bill

jana reddy, telangana bill, jana reddy press meet, telangana bill war, telangana issue, jana reddy press meet on t bill, jana reddy live press meet on t bill, speaker nadendla manohar, t congress ministers, jana reddy press meet at assembly media point, jana reddy press meet at assembly, telangana bill in assembly, T Bill Announcement political news, latest telugu news, breaking news, headlines,

minister jana reddy press meet on telangana bill

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది : జానారెడ్డి

Posted: 12/16/2013 07:11 PM IST
Minister jana reddy press meet on telangana bill

ఈరోజు మంత్రి జానారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటం జరిగింది.

 

* రాష్ట్ర ఏర్పాటుపై ఎన్ని అడ్డంకులు, అవంతరాలు ఎదురైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

* అసెంబ్లీలో బిల్లు ప్రతులను సీమాంధ్ర నేతలు చించడం అప్రజాస్వామికమని, దీనిపై సీమాంధ్ర నేతలు వివరణ ఇవ్వాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

 

* స్పీకర్ నాదెండ్ల మనోహర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై ప్రాంతీయ తత్వం మోపడం సరికాదని, స్పీకర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తారన్న విశ్వాసం తమకు ఉందని జానారెడ్డి పేర్కొన్నారు.

 

* అయితే వెంటనే బీఏసీ సమావేశం నిర్వహించి, బిల్లుపై చర్చించాలని, అసెంబ్లీ సమావేశాలు పొడిగించైనా బిల్లుపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

* తెలంగాణ బిల్లు ప్రాముఖ్యతను గ్రహించాలని, 15 రోజుల్లోగా రాష్ట్రపతికి పంపాలని జానారెడ్డి పేర్కొన్నారు.

 

* సీమాంధ్ర నేతలు బిల్లుపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అవగాహన లేకే ఆందోళనకు దిగుతున్నారని, విభజన రాజ్యాంగ బద్ధంగానే జరుగుతోందని అన్నారు.

 

* రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని జానారెడ్డి అన్నారు.

 

* రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. ఇలా మాట్లాడడం బాబు తగదని అన్నారు.

 

* తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమని, రాష్ట్రం ఏర్పాటు చేసిన రాష్ట్రపతి, ప్రధాని, సోనియా, రాహుల్‌కు కృతజ్ఞతలు అని మంత్రి జానారెడ్డి తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more