Sumathi Satakam in Telugu 31002 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఎప్పటికెయ్యది-ఎప్పుడు ఏది, ప్రస్తుతం- అవసరమై, అప్పటికి- ఆ సమయంలో, ఆ మాటలాడి- తగిన విధంగా మాట్లాడుతూ, అన్యుల- ఇతరుల, మనముల్- మనసులను, నొప్పించక- బాధ కలిగించక, తా నొవ్వక- తనూ బాధపడకుండా, తప్పించుక తిరుగువాడు- జాగ్రత్తగా వ్యవహరించేవాడు, ధన్యుడు- సఫలీకృతుడు

Get the Sumathi Satakam ఏ సమయానికి, సందర్భానికీ తగ్గట్టుగా మాట్లాడుతూ ఇతరులనూ నొప్పించుకుండా, తానూ బాధపడని విధంగా పరిస్థితులకనుగుణంగా మెసులుకుంటూ ఉండేవాడు సఫల జీవనాన్ని సాగిస్తాడు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం - 12

Posted: 01/25/2012 06:28 PM IST
Sumati satakam

sumati

ఎప్పిటికెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి యన్యుల మనముల్

నొప్పించక తానొవ్వక,

తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ

 

ఎప్పటికెయ్యది-ఎప్పుడు ఏది, ప్రస్తుతం- అవసరమై, అప్పటికి- ఆ సమయంలో, ఆ మాటలాడి- తగిన విధంగా మాట్లాడుతూ, అన్యుల- ఇతరుల, మనముల్- మనసులను, నొప్పించక- బాధ కలిగించక, తా నొవ్వక- తనూ బాధపడకుండా, తప్పించుక తిరుగువాడు- జాగ్రత్తగా వ్యవహరించేవాడు, ధన్యుడు- సఫలీకృతుడు.

ఏ సమయానికి, సందర్భానికీ తగ్గట్టుగా మాట్లాడుతూ ఇతరులనూ నొప్పించుకుండా, తానూ బాధపడని విధంగా పరిస్థితులకనుగుణంగా మెసులుకుంటూ ఉండేవాడు సఫల జీవనాన్ని సాగిస్తాడు.

పూర్వకాలంలోని పద్యాలలోని సొంపు ఇందులో బాగా కనిపిస్తుంది. చెప్పదలచుకున్నదాన్ని స్పష్టంగా చెప్పటమే కాకుండా హృదయానికి తగిలేట్టుగానూ, కలకాలం గుర్తుండేట్టుగా చెప్పటమే సూక్తుల లక్ష్యం. సూక్తిని ఒక పాఠ్యభాగంలా కాకుండా సులభంగా అర్థమయ్యే విధంగా ఛందోబద్ధంగా చెప్పగలిగిన ఆకాలపు కవులకు వారే సాటి.

ఈ పద్యం అర్థం చేసుకుంటే కంటి ముందు కదిలే రూపం శ్రీకృష్ణావతారం. భాగవత భారతాల్లో వర్ణించిన శ్రీకృష్ణుడు సందర్భాన్నెరిగి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవాడు. అలా చెయ్యగలిగినవాళ్ళు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించే సన్నివేశం నుంచైనా సులభంగా బయటపడగలుగుతారు. మేనేజ్ మెంట్ కోర్సులో కూడా సంభాషణకు విలువిస్తారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పేరుతో చెప్పేది అదే. నొప్పించక తానొవ్వక అన్నది కలకాలం గుర్తుండే మాట. ఇతరులను నొప్పించవద్దు, అలా గని నీవూ బాధపడవద్దంటారు ఈ శతక కర్త.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more