Sumathi Satakam in Telugu 30932 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఉపకారికి- మేలు చేసినవానికి, ఉపకారము సేయ- మేలు చెయ్యటం, విపరీతము కాదు- పెద్ద గొప్పేమీ కాదు, వివరింపంగా- వివరంగా విమర్శాత్మకంగా చూసినట్లయితే, అపకారికి- కీడు చేసినవానికి, నెపమెన్నక- తప్పు పట్టక, ఉపకారము సేయువాడు- మేలు చేసేవాడే, నేర్పరి- తెలివైనవాడు (బ్రతికే నేర్పు తెలిసినవాడు).

Get the Sumathi Satakam క్షమించటమంటే తాత్కాలికంగా పక్కకు పెట్టటం కాదు. ఎన్నని సహించను, అంటారు కొంతమంది. మరి అవన్నీ గుర్తు పెట్టుకున్నప్పుడు వాటిని సహించటం, క్షమించి వదిలెయ్యటం ఎక్కడ జరిగింది. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం - 11

Posted: 01/23/2012 06:58 PM IST
Sumati satakam

sumati-inner

ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ

ఉపకారికి- మేలు చేసినవానికి, ఉపకారము సేయ- మేలు చెయ్యటం, విపరీతము కాదు- పెద్ద గొప్పేమీ కాదు, వివరింపంగా- వివరంగా విమర్శాత్మకంగా చూసినట్లయితే, అపకారికి- కీడు చేసినవానికి, నెపమెన్నక- తప్పు పట్టక, ఉపకారము సేయువాడు- మేలు చేసేవాడే, నేర్పరి- తెలివైనవాడు (బ్రతికే నేర్పు తెలిసినవాడు).

మనకు మేలు చేసినవానికి తిరిగి మేలు చెయ్యటం అది తీర్చుకున్నట్టవుతుందే కానీ మీ గొప్పేమీ కాదు. మీకు కీడు చేసినవానికి కూడా అతని తప్పుని మనసులో పెట్టుకోకుండా మేలు చెయ్యగలగటమే గొప్ప అంటారు సుమతీ శతకం గ్రంథ కర్త. నేర్పరి అన్న పదంలో ఎంతో అర్థం ఉంది. నేర్పు గలవాడు అని మనం సామాన్యమైన అర్థంలో తెలివైనవాడు, ఏదైనా పని చెయ్యగలిగే సామర్థ్యం ఉన్నవాడు అనే భావంలో వాడుతుంటాం. కానీ ఈ భూమ్మీద బ్రతకటమనేదే గొప్ప నేర్పు. బ్రతకటమంటే ఎలాగోలా ఇతరుల దగ్గర్నుంచి తీసుకునో, మోసం చేసో బతకటం అని చాలా మంది అపోహ పడతారు. అలాంటివాడిని బ్రతకనేర్చినవాడు అని కూడా అంటుంటారు. కానీ అది కాదు బ్రతికే నేర్పంటే.

ఈ భూమ్మీద ఉన్నది మనమొక్కళ్ళమే కాదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మనం జీవించటం ముఖ్యమే కానీ సహజీవనం అంతకంటే ముఖ్యం. ఎవరికివారే అనే ధోరణిలో బ్రతికేవారైనా ఎవరూ లేకుండా బ్రతకలేరు కూడా. అందరితో కలిసి బ్రతకటమంటే అందరి అభిప్రాయాలనూ మన్నించటం, గౌరవించటం జరుగుతుంది. నాకెలాగైతే ఇష్టాయిష్టాలుంటాయో ఇతరులకు కూడా అలాగే వారి వారి ఇష్టాయిష్టాలుంటాయి. కాబట్టి వాటిని గౌరవించాలన్నది ప్రతివారూ తెలుసుకోవలసిన విషయం. మనకు అపకారం చేసిన మనిషినైనా క్షమించగలగటం చాలా గొప్ప సుగుణం. అందువలన సుగుణాలను పెంచే క్రమంలో ఉపదేశించిన ఈ సుమతీ శతకంలో ఈ పద్యం గొప్ప విశిష్టతను చోటుచేసుకుంది.

క్షమించటమంటే తాత్కాలికంగా పక్కకు పెట్టటం కాదు. ఎన్నని సహించను, అంటారు కొంతమంది. మరి అవన్నీ గుర్తు పెట్టుకున్నప్పుడు వాటిని సహించటం, క్షమించి వదిలెయ్యటం ఎక్కడ జరిగింది.

అలాగే, బలం తక్కువున్నప్పుడు ఏమీ చెయ్యలేములే అని వదిలెయ్యటం కూడా క్షమించటం అవదు. చేతనైన నష్టాన్ని కూడా కలుగజేయని వాడే నిజమైన క్షమాగుణం కలవాడు. మనసులో కూడా కీడు తలవకుండా ప్రతి ఒక్కరి క్షేమాన్ని కాంక్షించేవాడే నిజమైన సుగుణశీలి. అందుకే, అలా అందరూ కావాలనే ఉద్దేశ్యంతోనే, సుమతీ- అంటే మంచి బుద్ది కలవాడా సుగుణవంతుడా అని సంబోధించారీ సుమతీ శతకాల్లో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
10  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more