minister, whip faced amaravati farmers ire, మంత్రి, విప్ లకు తాకిన నిరసన సెగ.. క్యాబినెట్ భేటీ వాయిదా..!

Tension in amaravati as police lathi charged on protesting farmers

YS Jagan, Amaravati, Amaravati farmers, Lathi charge, police lathi charge on farmers, joint action committee, mahadharna, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Tension prevailed in the capital region of Amaravati with police foiling attempts by the farmers to stage Maha Dharna and lathi charged the protesting farmers who Gheoraod Minister Adimulapu Suresh, and whip pinnelli RamaKrishna Reddy vehicles at Chinna Kakani.

మంత్రి, విప్ లకు తాకిన నిరసన సెగ.. క్యాబినెట్ భేటీ వాయిదా..!

Posted: 01/07/2020 03:04 PM IST
Tension in amaravati as police lathi charged on protesting farmers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఓ వైపు ఆ ప్రాంత రైతులు గత 21 రోజులుగా నిరసనలు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా.. జనవరి 20 లోగా ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యోచిస్తున్న క్రమంలో ఇవాళ జాతీయ రహదారుల దిగ్భంధనంతో పాటు మహాధర్నా నిర్వహణకు అమరావతి రైతులు పిలుపునిచ్చారు. పోలీసులు ముందస్తు చర్యల్లు చేపట్టి గ్రామాల నుంచి రహదారులపైకి రాకుండా కంచెలను ఏర్పాటు చేసినా.. వాటిని చేధించుకుని రైతులు ఒక్కొక్కరుగా పెద్ద సంఖ్యలో రైతులు చినకాకానికి చేరుకున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు..పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. నిరసన కార్యక్రమాలకు చేపట్టారు. ఈ తరుణంలో రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో అటుగా వచ్చిన మంత్రి అదిమూలపు సురేష్ కు రైతుల నిరసన సెగ తగిలింది. ట్రాఫిక్ లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇబ్బందులు పడ్డారు. మంత్రి వాహనానికి దారి వదిలకుండా అందోళనకారులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించిన రైతులను పోలీసులు పక్కకు వెళ్లాలని చెప్పినా వారు వినలేదు. చివరకు పోలీసులు అందోళనకారులను చెదరగొట్టి మంత్రిని పంపించారు.

ఆ తరువాత అదే మార్గంలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తీవ్రంగా తాకింది. ఆయన కారుపై రాళ్లు రువ్విన అందోళనకారులు.. గన్ మెన్లపై కూడా దాడికి పాల్పడ్డారు. గన్ మెన్లతో కారులో చినకాకానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును నిరసనకారులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు ఎలాంటి హానీ జరగకూడదని గన్ మెన్లు ఆయనకు రక్షణగా నిల్చున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వచ్చి గన్‌మెన్లపై దాడికి దిగారు. కారును ముందుకు వెళ్లకుండా నిరసనకారులు అడ్డుకొన్నారు.

అంతే కారుపై నిరసనకారులు దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు మరో కారును అడ్డుగా నిలిపారు. కారుపై రాళ్లతో దాడికి దిగారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అంటూ కారు చుట్టూ ఆందోళనకారులు అడ్డుకొన్నారు. కారు ముందు కొందరు బైఠాయించారు. కారును ముందుకు పోకుండా అడ్డుకొన్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుకు అడ్డు పెట్టారు. పిన్నెల్లి కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. పోలీసులు కారును బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆందోళనకారుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

అయితే ఈ సమయంలో కారుపై నిరసనకారులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో కారు అద్దాలను మూసివేశారు. మరో వైపు కారుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడితో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఎదురుగా ఉన్న కారును అతి చాకచక్యంగా తప్పించుకొంటూ స్పీడుగా ముందుకు పోనిచ్చాడు. ఈ సమయంలో ఎమ్మెల్యే కారును వెంటాడి రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై తరువాత స్పందించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తన కారును ధ్వంసం చేసి.. గన్ మెన్లపై దాడికి పాల్పడింది రైతులు కాదుని, టీడీపీ మనుషులని అరోపించారు. రైతులు నిరసన చేప్టటడానికి మందుకోట్టి వస్తారా.? అంటూ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles