Nara Lokesh arrested at Benz circle బ్రేకింగ్: టీడీపీ యువనేత నారా లోకేష్ అరెస్ట్

Amaravati police arrests nara lokesh and other tdp leaders at benz circle

YS Jagan, Amaravati, Nara Lokesh, Police, Tension at Benz circle, Nara Lokesh Arrest, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Intensifying the agitation, farmers of the capital city area enforced a National Highway blockage. Nara Lokesh and other TDP leaders were arrested at Benz circle who were on the way to chinna kakani to support the farmers of Amaravati.

బ్రేకింగ్: టీడీపీ యువనేత నారా లోకేష్ అరెస్ట్

Posted: 01/07/2020 03:58 PM IST
Amaravati police arrests nara lokesh and other tdp leaders at benz circle

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతి పరిధిలో ఎక్కడ చూసిన రైతులు అందోళనబాట పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్ నేపథ్యంలో ఎంతో భాదపడినా.. తమవారి భవిష్యత్ తరానికి మేటు జరుగుతుందన్న ఆశతో తాము ప్రభుత్వానికి భూములను అందించామని.. అయితే ఇప్పడు తమ భూములతో పాటు తమ వారి భవిష్యత్తును కూడా అదే ప్రభుత్వం అంథకారమయం చేసిందని రైతులు అరోపిస్తున్నారు. అధికారంలోకి పార్టీలు మారినంతమాత్రన.. ప్రభుత్వాల విధివిధానాలను లెక్కపత్రం లేకుండా ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు.

రాజధాని పేరుతో తీసుకున్న తమ భూములను ఐదున్నరేళ్లు పాటు ప్రభుత్వం తమ వద్ద అంటిపెట్టుకుని.. హద్దులను చెరిపేసి.. పంటపోలాలను కాంక్రీట్ మయంగా మార్చిన తరువాత ఇప్పుడు వెనక్కు తిరిగిస్తామని అనడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని పరిరక్షణ సమితి జేఏసీ ఇవాళ తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనంలో రైతులకు మద్దతుగా అక్కడకు చేరుకుని సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన టీడీపీ యువనేత నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

జాతీయ రహదారి దిగ్భందానికి విపక్షాలు పిలుపు ఇవ్వడంతో నారా లోకేష్ చినకాకానికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమై లోకేష్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ అరెస్టును అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిగ్గా బెంజ్ సర్కిల్‌ సమీపానికి చేరుకున్న నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి యనమల కుదురు పొలిస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

అమరావతిలో ఆందోళనలు మరింత ఉదృత రూపం దాల్చాయి. రాజధాని రైతులతోపాటుగా పలు పార్టీల నేతలు రోడ్లపై ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో మూడు ‘రాజధానులు వద్దు- అమరావతి ముద్దు’ అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక కోటగుమ్మం సెంటర్‌ నుంచి డిలాక్స్‌ సెంటర్‌ వకు నిరసన ర్యాలీ కొనసాగింది. టీడీపీ, జనసేన న్యాయవాదులు, వివిధ రాజకీయ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles