another twist in nri jayaram case జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

Sensational twist in coastal bank director chigurupati jayaram case

Rakesh Reddy, NRIs Murder Case, Chanchalguda Jail, Nallakunta CI Srinivas, surya, charecter artist surya, Ibrahimpatnam ACP Malla Reddy, Hyderabad, Telangana, Crime

The A-1 accused in NRI Chigurupati Jayaram’s murder case, Rakesh Reddy revealed sensational details during police interrogation in custody, stating that he has honey trapped jayaram and he had demanded money by threaten him

జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

Posted: 02/14/2019 01:38 PM IST
Sensational twist in coastal bank director chigurupati jayaram case

తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను ఎవరి నుంచి డబ్బును అప్పుగా తీసుకునే అవసరం కూడా లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ సాగించారు. రాకేష్ రెడ్డి జయరాంకు నాలుగు కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చాడన్న కోణంలో పోలీసులు విచారణ సాగడంతో పలు ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

తనకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వకపోవడంతో కొట్టాననీ, దీంతో హార్ట్ పేషంట్ కావడంతో జయరాం చనిపోయాడని.. పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్ లో కట్టుకధలు అల్లుతూ.. జయరాం హత్య జరిగిన నాటి నుంచి చెప్పుకోచ్చిన నిందితుడు రాకేశ్ రెడ్డి.. ఒక్కసారిగా పోలీసుల విచారణలో మాటమార్చాడు. తాను జయరాంను హనీట్రాప్ చేశానని అంగీకరించాడు. కేవలం అతన్ని బెదరించి అతని వద్దనుంచి డబ్బులు లాగేందుకు ప్రయత్నిం చేశానని రాకేష్ రెడ్డి తెలిపాడని సమాచారం.

తాజాగా పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడని తెలుస్తోంది. నిజానికి రాకేశ్ రెడ్డికి జయరాం రూపాయి కూడా అప్పు లేడని విచారణలో తేలింది. జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు ఆయన్ను ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు. జయరాంను చంపేసిన అనంతరం హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దించి అప్పు ఇచ్చినట్లు దొంగ పత్రాలు సృష్టించాడని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే చింతల్ కు చెందిన ఓ రౌడీ షీటర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakesh Reddy  NRIs Murder Case  actor surya  Chanchalguda Jail  Hyderabad  Telangana  Crime  

Other Articles