Jammu terror attack: 12 CRPF jawans killed కాశ్మీర్లో బీభత్సం.. 12 మంది జవాన్ల మృతి..

12 crpf jawans killed many injured in jk terror attack

CRPF. IED blast, Army vehicle, CRPF jawans, Lethpora, Militant group, Jaish-e-Mohammad, Awantipora area, Jammu-Srinagar highway, Pulwama district

Twelve Central Reserve Police Force jawans were killed and many others injured in a blast in Jammu and Kashmir. The blast was triggered by militants to target a vehicle carrying the CRPF jawans.

పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

Posted: 02/14/2019 04:43 PM IST
12 crpf jawans killed many injured in jk terror attack

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర ప్రాంతంలోగల లేత్ పోరా వద్ద జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లున్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి (ఐఈడీ) భారీ విధ్వంసానికి పాల్పడ్డారు.

సీఆర్పీఎఫ్ జవాన్లపై తుపాకీ కాల్పులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డారు. ఐఈడీ బాంబు పేలుడులో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ 54వ బటాలియన్ కు చెందిన వాహనంలో జవాన్లు గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో అవంతిపుర వద్ద ఈ దాడి జరిగింది.

సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలను టార్గెట్ చేసిన ముష్కరులు.. ఒక అటోలో ఐఈడీ బాంబును అమర్చి జాతీయ రహదారిపై ఉంచారు. సరిగ్గా ఆ దారినే సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనం వస్తున్న క్రమంలో బాంబును పేల్చడంతో.. 12 మంది జవాన్లు అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ 54వ బటాలియన్ చేరువలో బాంబుదాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులు.. తుపాకులతో బుల్లెట్‌ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల మెరుపు దాడిలో పలువురు ఉగ్రవాదులు ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు సమాచారం.

దీంతో వెనువెంటనే అలర్ట్ అయిన భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల లక్ష్యంగా కాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరగడంతో.. ముష్కరమూకలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఉగ్రబీభత్సానికి పాల్పడింది తామేునని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. కాగా, ఈ ఉగ్రదాడిని మాజీ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన క్షతగాత్రులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CRPF. IED blast  Army vehicle  Lethpora  Militant group  Jaish-e-Mohammad  Crime  

Other Articles