Sneha, the woman without caste and religion కులమతాలకు అతీతురాలు ఈ స్నేహ..!

Tirupattur woman sneha gets no caste no religion certificate

M A Sneha, religionless, Sneha, casteless, woman, advocate, law, no case, no religion, Tirupattur Tahsildar, T S Sathiyamoorthy, Vellore district, Tamil Nadu, weird news

Sneha, a lawyer by profession, who hails from Tirupattur in Vellore district of Tamil Nadu, says her eyes swelled when she received the ‘no caste, no religion’ certificate from Tirupattur Tahsildar T S Sathiyamoorthy

ఇదే ప్రప్రథమ ధృవీకరణ.. కులమతాలు లేని నారీమణి..

Posted: 02/14/2019 12:49 PM IST
Tirupattur woman sneha gets no caste no religion certificate

ఈ నారిమణి అనన్యసామాన్యురాలు. స్వతంత్ర్య భారతావనిలో ఎందరెందరో రాజకీయ నాయకులు అనేకానేక సందర్భాల్లో తమ ప్రసంగాల్లో తమది సేవకులం.. తమ మతం మానవత్వం అని వల్లేవేస్తున్నా.. బందుప్రీతీ, కులతత్త్వం, మతతత్వం లేకుండా మాత్రం ఏ పనులు చేయరన్న విమర్శలు కూడా వున్నాయి. అయితే తాను మాత్రం మాటలు చెప్పే మనిషిని కాదని, చేతల్లో చేసి చూపే మనిషినని.. ఆ దిశగా నడుంచుట్టింది ఈ నారీమణి.

దీన్ని ఆచరణలో పెట్టిన ఓ నారీమణి తాను ఏ కులం, మతానికి చెందిన వ్యక్తిని కాదని సర్టిఫికెట్ పొందింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పతూర్ లో చోటుచేసుకుంది. రెండేళ్లుగా తాను కుల, మతాలకు అతీతమైన వ్యక్తినంటూ అమె చేసిన పోరాటం చివరకు ఫలించింది. అనేక సందర్భాల్లో తిరస్కరణకు, కుంటి సాకులకు గురై వెనక్కు వచ్చిన ఆమ అభ్యర్థన.. ఓడిన కొద్ది రెట్టింపు ఉత్సహాంతో అమె చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఎట్టకేలకు సఫలీకృతం అయ్యింది.

తిరుప్పతూర్ మండలంలోని ఎం.ఎ.స్నేహను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా పెంచారు. దీంతో ఆమె పాఠశాల నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల వరకూ అన్నింటిలో  కులం, మతం కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారు. ఈ క్రమంలోనే తనకు కులం, మతం లేదనీ, భారతీయురాలిగా సర్టిఫికెట్ జారీచేయాల్సిందిగా కోరారు. అయితే రకరకాల సాకులు చెబుతూ ఇందుకు అధికారులు నిరాకరిస్తూ వచ్చారు. చివరికి ఈ విషయం తెలుసుకున్న తిరుప్పతూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పంకజమ్ వెరిఫికేషన్ చేయించారు.

ఇందులో యువతి చెప్పిన వివరాలన్నీ నిజమని తేలడంతో ఆమెకు కులం, మతం లేదని సర్టిఫికెట్ జారీచేయాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 5న స్నేహకు అధికారులు ‘ఎలాంటి కులం మతం లేదని సర్టిఫికెట్ జారీచేశారు. దీనిపై స్నేహ హర్షం వ్యక్తం చేశారు. స్నేహ భర్త పార్తీబ రాజా మాట్లాడుతూ.. తమ ముగ్గురు కుమార్తెల స్కూల్ దరఖాస్తుల్లో కూడా కులం, మతం ప్రస్తావన తీసుకురాలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ తరహా సర్టిఫికెట్ ను దేశంలో అందుకున్న తొలి వ్యక్తి స్నేహానేనని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : M A Sneha  advocate  no case  no religion  Certificate  Tirupattur  vellor  Tamil Nadu  

Other Articles