Inter student attacked by psycho with a coconut sickle బర్కత్ పురాలో మరో ప్రేమోన్మాది ఘాతుకం..

Inter student attacked by a youngster with a coconut sickle at barkatpura

psycho attack, love proposal, Madhulika, Bharat, harassment, Barkatpura, Kachiguda police, Hyderabad, crime

A psycho attacked an Intermediate girl with coconut sickle on the road to accept his love at Barkatpura under Kachiguda police station limits. The victim identified as Madhulika. Bharat was harassing Madhulika since long time to accept his love.

ITEMVIDEOS: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంటర్ విద్యార్థిపై కత్తితో దాడి

Posted: 02/06/2019 02:11 PM IST
Inter student attacked by a youngster with a coconut sickle at barkatpura

హైదరాబాద్ నడిబోడ్డున మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ ఇంటర్ విద్యార్థినిపై కొబ్బరిబోండాల కత్తితో రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించాలని వెంటపడి వేధించడంతో పాటు పదే పదే అదే పనిగా అమెను విసిగించాడు. అయినా సదరు యువతి నిరాకరించడంతో ఉన్మాది రెచ్చిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు, మలక్ పేట అసుపత్రికి తరలించి చికిత్సను అందించారు.

అయితే ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఉన్మాది దాడిలో విద్యార్థిని తలకు, చేతలకు తీవ్రంగా గాయాలయ్యాయని, అమె పరిస్థితి విషమంగానే వుందని మలక్ పేట యశోధా అసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇవాళ ఉదయం విద్యార్థిని కళాశాలకు చేరకుంటున్న క్రమంలో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని బర్కత్ పురా సత్యానగర్ ప్రాంతానికి చెందిన మధులిక అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమించాలని మధులికను కొంతకాలంగా వేధిస్తున్నాడు. అయితే యువతి ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కళాశాలకు వెళుతుండగా మరోసారి మధులికను అడ్డుకున్న నిందితుడు.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు బాధితురాలు ససేమిరా అంది.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో మధులిక మెడపై వేటు వేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టపక్కలవారు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని మలక్ పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : psycho attack  love proposal  Madhulika  Bharat  harassment  Barkatpura  Kachiguda police  Hyderabad  crime  

Other Articles

 • Actress and director vijaya nirmala is no more

  ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

  Jun 27 | అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో... Read more

 • Demolition of praja vedika

  ప్రజావేదిక కూల్చివేత...

  Jun 26 | ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల... Read more

 • Netizens trolls on ongole gang rape case

  ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

  Jun 24 | ఒంగోలులో 16ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ... Read more

 • Kia unveils seltos in india packs it with premium features

  అనంతపురం కియా మోటార్స్ నుంచి తొలి ఎస్.యూ.వీ

  Jun 20 | సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్‌యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్‌తో పాటు విడుదల... Read more

 • Telugu content

  రాంగ్ పార్కింగ్ వాహనదారులకు ఇకపై షాక్..!

  Jun 20 | మీరు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారా ? అయితే జేబుకు చిల్లు పడినట్లే. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా..నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రూ. 10 వేల... Read more

Today on Telugu Wishesh