AP Police transfered Jayaram's murder case to Telangana ఎన్నారై జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ..

Andhra pradesh police transfered jayaram s murder case to telangana

Chigurupati Jayaram, Jayaram murder case, Telangana police, AP police, Padma sri, Shikha choudhary, rakesh reddy, crime

In a new twist in the murder case of NRI, Industralist Chigurupati Jayaram, reports are coming that Andhra Pradesh Police decided to transfer the case to Telangana police. AP Police yet to confirm this officially.

జయరాం భార్య పద్మశ్రీ అరోపణలు.. హత్యకేసు తెలంగాణకు బదిలీ..

Posted: 02/06/2019 01:01 PM IST
Andhra pradesh police transfered jayaram s murder case to telangana

ప్రముఖ వ్యాపారవేత్త ఎన్నారై చిరుగుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితులను తప్పించేందుకు ఆంద్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య పద్మశ్రీ ఆరోపించిన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పారిశ్రామిక వేత్త హత్యకేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలను వెల్లడించినా.. హతుడి భార్య తెలంగాణలోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అంధ్ర్రప్రదేశ్ పోలీసులు ఈ విషయంలో అమె తేవనెత్తిన అరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తాము ఎలాంటి వత్తిళ్లకు లొంగి కేసును దర్యాప్తు చేయలేదని, ఎవర్నీ రక్షించాలని తమకు ఎవరి నుంచి సిఫార్సులు రాలేదని ఇదివరకే డీఎస్సీ బోస్ స్పష్టం చేసినా.. కేసు విచారణ పూర్తై.. రాకేష్ రెడ్డి సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన క్రమంలోనూ అమె అరోపణలు గుప్పించడంతో.. ఏపీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం, ఈ కేసు నేపథ్యంలో హత్య జరిగింది హైదరాబాద్ లో కాబట్టి.. కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించాలని వారు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. నేరం జరిగిన ప్రదేశంలోనే కేసు నమోదు చేయాలని చట్టంలోని నిబంధనలు చెబుడం కూడా మరో కారణంగా తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య తెలంగాణలోని హైదరాబాద్ లోనే జరిగింది కాబట్టి ఈ కేసును అక్కడికే బదిలీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈ కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ లను నందిగామ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వారిద్దరికీ ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించింది. కాగా, జయరాం హత్య కేసులో నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కోరే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chigurupati Jayaram  murder case  Padma Sri  Shikha choudhary  Telangana police  AP police  Crime  

Other Articles