Gold worth Rs 10 crore looted in Bihar సినీ ఫక్కీలో భారీ దోపిడి.. రూ.10 కోట్ల బంగారం లూఠీ

Gold worth rs 10 crore looted from muthoot finance in bihar s muzaffarpur

Gold worth Rs 10 crore looted in Bihar, Gold worth Rs 10 crore looted, Gold Ornaments worth Rs 10 crore, Five bags gold looted, Five bags gold looted in Bihar, Five bags gold looted in Bihar's Muzaffapur, gold looted, Muthoot Finance, Bhagwanpur, Robbery, Muzaffapur, Bihar, crime

Five bags full of gold, said to be worth about Rs 10 crore, were looted by a group of armed robbers from the premises of muthoot finance in Bihar's Muzaffarpur.

సినీ ఫక్కీలో భారీ దోపిడి.. రూ.10 కోట్ల బంగారం లూఠీ..

Posted: 02/06/2019 03:14 PM IST
Gold worth rs 10 crore looted from muthoot finance in bihar s muzaffarpur

బిహార్ లో దోపిడి దొంగల మరోమారు పేట్రోగిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సంచుల నిండా వున్న బంగారు ఆభరణానలు లూఠీ చేశారు. వాటి విలువ సుమారు 10 కోట్ల రూపాయల వుంటుందని అంచనా. సాయుధులైన దొంగలు బిహార్లోని ముజాఫర్ పూర్ ఫ్రాంతంలో గల ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలోకి ప్రవేశించి ఈ భారీ దోపిడికి తెరలేపారు. బ్యాంకు అధికారుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది, వాచ్ మెన్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ యధవిధిగా బిహార్ లోని ముజాఫర్ పూర్ భగవాన్ పూర్ ఫ్రాంతంలోని ముత్తూట్ ఫైనాన్స్ తెరుచుకన్న తరువాత కస్టమర్లుగా నటిస్తూ ఆరుగురు సాయుధులు ముసుగులు ధరించి ఫైనాన్స్ లోకి ప్రవేశించారు. ఆఖరువాడు వచ్చి రాగానే ముఖద్వారం వద్దనున్న గార్డు తలపై దాడి చేయడంతో అతను సృహకోల్పోయాడు.

ముందుగా వచ్చిన సాయుధ అగంతకుడు నేరుగా ఫైనాన్స్ మేనజరు వద్దకు చేరుకుని అతనికి తుపాకిని గురిపెట్టి.. వెంటనే లాకర్ తాళాలు తీసుకున్నాడు. మిగిలిన ఐదుగురు సాయుధ దోంగలు బ్యాంకులోని మిగతా సిబ్బందిని.. కస్టమర్లను తుపాకులతో బెదిరించారు. అదే సమయంలో తొలుత వచ్చిన దొంగ.. ఐదు సంచుల్లో ఫైనాన్స్ లోని తాకట్టు పెట్టిన బంగారు అభరణాలన్నింటినీ నింపుకుని వెళ్లాడని ప్రత్యక్ష సాక్ష్యలు తెలిపారు.

తన వద్దకు ఒక వ్యక్తి వచ్చాడని, బంగారం తాకట్టు పెట్టాలని కస్టమర్ల మాదిరిగా రావడంతో తాను వారిని లోనికి వెళ్లి మేనేజరును వివరాలు చెప్పాల్సిందిగా సూచించానని చెప్పాడు. ఇంతలో వచ్చిన ఆఖరు వాడు తన చేతిలోని తుపాకీ వెనుకభాగంతో తన తలపై బలంగా కొట్టాడంతో తాను సృహకోల్పోయానిని.. తాను మళ్లీ సృహలోకి వచ్చి మైకం కమ్మిన కళ్లతో చూసే సరికి వారు సంచుల నిండా బంగారాన్ని తీసుకుని వెళ్తున్నారని ఫైనాన్స్ గార్డు తెలిపాడు.

కాగా, పైనాన్స్ సిబ్బందిలో ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఆరుగురు సాయుధ దొంగల్లో ఒకరు ఐదు సంచులను తీసుకువచ్చాడని, అతనే నేరుగా బ్యాంకులోని లాకర్లలో దాచిన బంగారు ఆభరణాలను వాటిల్లో నింపుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై దొంగలు నిష్ర్కమించిన తరువాత బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని ముజాఫర్ పూర్ సీనియర్ ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ దోపిడిపై సిబ్బంది, సాక్షులు తెలిపిన వివరాలను నమోదు చేసుకున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, తమకు సిసిటీవీ ఫూటేజీ ముఖ్యఆధారంగా మారనుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold looted  Muthoot Finance  Robbery  Bhagwanpur  Muzaffapur  Bihar  crime  

Other Articles