Never use that word, dear Pawan Kalyan: Paruchuri జనసేనాని ఆ పదం వినియోగించడం సముచితం కాదు: పరుచూరి

Paruchuri suggests pawan not to use one particular word in politics

pawan kalyan, janasena, Paruchuri Gopala Krishna, pawan kalyan empathetic, pawan kalyan vexed, pawan kalyan pained, andhra pradesh, politics

Paruchuri Gopala Krishna, a self-confessed Pawan Kalyan admirer, has a suggestion for the Jana Sena chief. He should not use a particular word ever in his speeches.

ITEMVIDEOS: జనసేనాని ఆ పదం వినియోగించడం సముచితం కాదు: పరుచూరి

Posted: 02/06/2019 10:51 AM IST
Paruchuri suggests pawan not to use one particular word in politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయ పార్టీగా అవిర్భవించి.. రాష్ట్ర ప్రజల్లో, జనసేన కార్యకర్తల్లో.. ఇక ఇటు అభిమానుల విషయంలోనూ అంతకంతకూ ఆదరణను పెంచుకుంటూ.. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న పార్టీలకు, తనకు మధ్య తేడా ఏంటని స్పష్టంగా వివరిస్తూ.. పారదర్శక పాలన, ప్రజలతోనే అభివృద్ది, పర్యావరణ హేతుకర అభివృద్ది అంటూ ముందుకు సాగుతున్న పవన్ కల్యాన్.. రాజకీయంగా తొలిసారి ప్రత్యక్ష పోరుకు దిగుతున్న క్రమంలో.. ఆయనకు హితులు, మేధావులు కూడా అండగా నిలుస్తూ పలువురు తమ భావాలను, అభిప్రాయాలను కూడా ఆయనతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో సినీ రచయిత, మెగా కుటుంబ శ్రేయోభిలాషి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వక్యిత్త్వ అభిమాని పరుచూరి గోపాలకృష్ణ తాజాగా పవన్ కల్యాణ్.. రాజకీయ నేతగా ఏ అంశానైనా మాట్లాడవచ్చునని అయితే తాను కొరుకున్న మార్గంలో ఎంతటి అసహనం ఎదురైనా పవన్ పోరబాటుగానైనా, గ్రహపాటుగానైనా విసుగు అన్న పదాన్ని వినియోగించడం సముచితం కాదని పరుచూరి గోపాలకృష్ణ సూచించారు. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించిన ప్రస్తావన తెచ్చారు.

"పవన్ కల్యాణ్ కి లక్షల్లో అభిమానులు వున్నారు .. అలాంటి అభిమానుల్లో నేను ఒకడిని. పవన్ నటన అన్నా .. ఆయన వ్యక్తిత్వమన్నా నాకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన గురించి మాట్లాడాలనిపించింది. భగవంతుడు ఒక బంగారు తివాచి వేసి .. దీనిపై నడుచుకుంటూ వెళ్లు నాయనా అంటే, జనం కోసం దాని పక్కకొచ్చి ముళ్లు గుచ్చుకుంటాయా .. రాళ్లు గుచ్చుకుంటాయా అనేది ఆలోచించకుండా తాను ప్రజాసేవ మార్గాన్ని ఎంచుకుని కష్టానష్టాలను, భాధలు, ఇబ్బందులను.. వ్యయప్రయాసలను తన జీవితంలోకి అహ్వానించాడని.. అ దిశగానే ముందుకు వెళుతున్నాడని అన్నారు.

ఇలాంటి పనులు అందరూ చేయలేరు. మొన్నీమధ్య ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ బాధేస్తోంది .. భయమేస్తోంది .. విసుగొస్తోంది అనే మూడు మాటలు మాట్లాడాడు. బాధ ఉండాలి .. జనానికి ఏమౌతుందోనని .. భయం ఉండాలి, నా ప్రజలకు ఏం జరుగుతుందోనని. కానీ పవన్ 'విసుగొస్తోంది' అనే మాట అనకూడదు. ఎందుకంటే విసుగొచ్చేలా చేయడమే రాజకీయం. 'పవన్ నువ్వు ఈ మార్గంలోకి ప్రేమించి వెళ్లావు .. ఏమీ ఆశించి వెళ్లలేదు .. అందువలన విసుగు అనే మాటను వాడకూడదు. అనుకున్నది సాధించేవరకూ పోరాడుతూనే ఉండాలి' అని చెప్పుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles