Telugu TV artist Jhansi ends life టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య.. ప్రేమ విఫలమై.. డబ్బు కోల్పోయి..

Telugu tv actress naga jhansi commits suicide in hyderabad

Naga Jhansi, naga jhansi, pavitra bandhan, telugu actress suicide, Jhansi brother Durga Prasad, Surya, surya alias nani, vijayawada surya, love affair, Jhansi love affair with surya, Pavitra Bandhan actress, Telugu TV actress, hyderabad, Pavitra Bandhan, suicide, crime

Telugu TV actress Jhansi allegedly committed suicide in her flat at Sri Sai Apartments in Srinagar Colony, She allegedly killed himself by hanging herself from the ceiling fan at her apartment

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య.. ప్రేమ విఫలమై.. డబ్బు కోల్పోయి..

Posted: 02/06/2019 11:52 AM IST
Telugu tv actress naga jhansi commits suicide in hyderabad

తెలుగు బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె, తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కృష్టా జిల్లా ముద్దెనెపల్లి మండలం వాడాలి గ్రామానికి చెందిన నటి.. నటనలో బాగా రాణించి.. సిరీయల్స్ లో నటిగా స్థిరపడింది. మా టీవిలో ప్రసారమయ్యూ పవిత్రబంధం సీరియల్ తో తెలుగు టీవి ప్రేక్షకులకు చేరువైన ఝాన్సీ ఇక లేదు.

కాగా, ఝాన్సీ ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారంతో పాటు, ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ప్రస్తుతం ఆమె మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉండగా, గుడివాడలో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని హైదరాబాద్ కు చేరకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి అమె ప్రేమిస్తున్న వ్యక్తి సూర్య అలియాస్ నాని అనే యువకుడు వచ్చాడని, ఆపై వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంటూ, ఎదుగుతున్న క్రమంలో సదరు యువకుడితో లవ్ లో పడ్డ ఝాన్సీ, అతనికి డబ్బు సాయం చేసినట్టు తెలుస్తోంది.

ఇక అతనితో ఏడడుగులు వేస్తానన్న నమ్మకంతో.. అడిగినంతా ఇచ్చిన ఝాన్సీ.. తీరా పెళ్లి చేసుకుందామనే సరికి మాత్రం అతను మొహం చాటేయడం, డబ్బు అడిగితే, ఇవ్వబోనని చెప్పడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తుంది. ఆత్మహత్యకు ముందు ఆమె తన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాఫ్తు చేస్తున్నామని, సాయి అపార్ట్ మెంట్స్ వాచ్ మెన్ ను ప్రశ్నిస్తున్నామని, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని పంజాగుట్ట పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

ఝాన్సీ ఆత్మహత్య వెనుక ఆమె ప్రియుడు సూర్య ప్రేమయం ఉందని భావిస్తున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సూర్యతో వాట్స్ యాప్ లో ఝాన్సీ చాటింగ్ చేసిందని, వారిద్దరూ కలుసుకున్నారని, ఆపైనే ఆమె ఉరి వేసుకుందని నిర్ధారించిన పోలీసులు, సూర్యను విచారిస్తున్నారు. ఘటనా స్థలిలో ఝాన్సీ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని లాక్ ను ఓపెన్ చేసేందుకు సైబర్ క్రైమ్ నిపుణుల సహాయం కోరారు.

తన కూతురు నాగఝాన్సీ ఆత్మహత్యపై స్పందించిన అమె తల్లి.. తన కూతురు ప్రేమ వ్యవహారం కారణంగానే మరణించిందన్న విషయమై విస్మయం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి తన కుమార్తె షూటింగ్ లకు వెళ్లడం లేదని ఆమె తెలిపారు. చిరాగ్గా ఉందని చెబుతూ ఇంట్లోనే ఉండేదని చెప్పారు. తన కుమార్తె ప్రియుడిగా చెబుతున్న సూర్య ఎవరో తనకు తెలియదని అన్నారు. తన కుమార్తె ప్రేమ వ్యవహారం, సహజీవనం వంటి విషయాలు కూడా తనకు తెలియవని చెప్పారు. నిన్న రాత్రి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడిందని... ఆ సమయంతో ఆమెతో పాటు తన కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Jhansi  Pavitra Bandhan actress  Telugu TV actress  hyderabad  love affair  surya  suicide  crime  

Other Articles

Today on Telugu Wishesh