Teacher to die by hanging for raping 4-year-old చిన్నారిని చిదిమేసిన ఉపాధ్యయుడికి ఉరిశిక్ష

Man sentenced to death in india over gruesome child rape

Mahendra Singh Gond, school teacher, satna district court, death sentence, convicted of raping, Bhopal, jabalpur, Madhya Pradesh, Crime

A teacher has been sentenced to death by hanging for raping a four-year-old student so badly that she had to have her intestines realigned.

చిన్నారిని చిదిమేసిన ఉపాధ్యయుడికి ఉరిశిక్ష

Posted: 02/05/2019 03:42 PM IST
Man sentenced to death in india over gruesome child rape

పాలుగారే నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన ఓ కసాయికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. చిన్నారిపై దారుణ అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను అటవీ ప్రాంతంలో వదిలేసిన పాఠశాల ఉపాధ్యాయునికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. అంతేకాదు ఉపాధ్యాయుడి వేషంలో వున్న మగమృగానికి శిక్షను అమలు పర్చడంలో తేదీని కూడా విధించింది అదేశాలను పంపింది. మార్చి 2న శిక్షను అమలు చేయాలని జబల్ పుర్‌ కేంద్ర కారాగార అధికారులను అదేశించింది.

గతేడాది జూన్‌ 30న నాలుగేళ్ల చిన్నారిని ఉపాధ్యాయుడు మహేంద్రసింగ్‌ గోండ్‌.. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై అతిదారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక స్పృహ కోల్పోయి అచేతనంగా మారడంతో, చనిపోయిందని భావించి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కుమార్తె ఎంతకూ ఇల్లు చేరలేదని తల్లిదండ్రులు వెతకగా ఎట్టకేలకు చిన్నారి జాడ కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర సంచలనం కావడంతో పోలీసులు వెంటనే నిందితుడిని పట్టుకున్నారు.

కాగా, పైశాచిక మగృం దాడిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన బాలికను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని హెలికాప్టర్ లో ఢిల్లీకి తరలించి ఎయిమ్స్ కు తరలించింది. దారుణ అకృత్యానికి ఆమె పేగులు బాగా దెబ్బతినడంతో నెలల తరబడి ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. పలు శస్త్రచికిత్సలు చేస్తేగాని సాధారణ స్థితికి రాలేకపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన నాగోద్‌ సెషన్స్‌ కోర్టు గత సెప్టెంబరులో నిందితుడికి మరణదండన విధించింది.

నాగోద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు వెళ్లగా రాష్ట్రోన్నత న్యాయస్థానం కూడా కింద కోర్టు తీర్పుపై సానుకూలంగా స్పందించింది. జనవరి 25న నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న తీర్పును సమర్ధించింది. ఈ క్రమంలో శాంతా జిల్లా సెషన్స్‌ కోర్టు గోండ్ కు వ్యతిరేకంగా బ్లాక్‌ వారెంట్‌ జారీచేసింది. అతడిని వచ్చేనెల 2న ఉరి తీయాలంటూ జబల్‌పుర్‌ కేంద్ర కారాగారాన్ని ఆదేశిస్తూ ఈ-మెయిల్‌ పంపింది. సుప్రీంకోర్టు లేదా రాష్ట్రపతి నుంచి నిలుపుదల ఉత్తర్వులు రాకపోతే శిక్ష యథాతథంగా అమలవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles