sbi shocks dwcra women on cheques చెల్లని చెక్కులా..? పాత బకాయిల కింద జమయ్యాయా.?

Vinjamuru sbi shocks dwcra women on pasupu kumkuma cheques

SBI, Bank Officials, vinjamuru sbi bank, sbi bank manager, dwcra women, pasupu kumkuma cheques, cheque deposits, debts

SBI Bank Officials of vinjamuru gives shock to dwcra women on pasupu kumkuma cheques by depositing them into their debts.

చెల్లని చెక్కులా..? పాత బకాయిల కింద జమయ్యాయా.?

Posted: 02/05/2019 02:51 PM IST
Vinjamuru sbi shocks dwcra women on pasupu kumkuma cheques

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎన్నికల జిమ్మికులు అనేకం చేస్తారని అందులో భాగంగానే పెన్షన్ల రెట్టింపు జరిగిందని, డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ పేరుతో చెక్కుల పంఫిణీ జరిగిందని ఇప్పటికే విమర్శిస్తున్నారు విపక్ష పార్టీ వైసీసీ నేతలు. ఈ క్రమంలో మరో అడుగుముందుకేసిన ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చెల్లని చెక్కులు ఇచ్చారని కూడా అరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతలు చేసిన అరోపణలే నిజమయ్యాయా.? అన్న అనుమానాలు ఇప్పుడు తలెత్తక మానవు.

ఔనా.? ఎందుకని అంటారా.? డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇచ్చిన రూ. 10 వేల 'పసుపు - కుంకుమ' చెక్కులను క్యాష్ చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన నెల్లూరు జిల్లా వింజమూరు మహిళల ఆనందం గంటల్లోనే ఆవిరైంది. బ్యాంకులోకి వెళ్లిన చెక్కులను డిపాజిట్ చేసుకున్న అధికారులు వాటికి బదులు నగదు ఇవ్వకుండా.. బకాయిల కింద జమ చేసుకుంటున్నామని చెప్పగానే.. డ్వాక్రా మహిళలు విస్మయానికి గురయ్యారు. బ్యాంకు ఎదుటే ధర్నాకు దిగారు.

ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగింది. వింజమూరులోని ఎస్బిఐ బ్యాంకు అధికారులు చెక్కులను డిపాజిట్ చేసిన నగదు ఇచ్చే క్రమంలో పై అధికారుల వత్తిడి లేకపోయినా.. వారంతటవారే ఓ నిర్ణయానికి వచ్చి మెలిక పెట్టారు. ఈ ఘటన తాలుకు మరిన్ని వివరాల్లోకి వెళితే, ఒక్కో పొదుపు మహిళకూ రూ. 10 వేల చొప్పున ఏపీ సర్కారు చెక్కులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని బ్యాంకుల్లో వేసుకుని, నేరుగా డబ్బు తీసుకోవచ్చని కూడా మంత్రులు స్పష్టం చేశారు. దీంతో ఎంతో ఆశతో బ్యాంకుకెళ్లిన మహిళలు, అధికారులు చెప్పిన మాటతో అవాక్కైన పరిస్థితి.

మహిళలు రోడ్డుపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పేందుకు నానా తంటాలూ పడ్డారు. ఇక ఇదే విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించగా, పలు పొదుపు సంఘాల గ్రూప్ లు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించలేదని, అందువల్లే కొంత మొత్తాన్నైనా జమ చేయాలని కోరామని అన్నారు. అయితే, ఈ విషయంలో అధికారుల నుంచి మాత్రం తమకు ఎటువంటి ఆదేశాలూ రాలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles