Man found dead in suspected honour killing కరీంనగర్ లో అనుమానిత పరువు హత్య కలకలం..

Telangana man found dead in suspected honour killing in karimnagar

Honour Killing, man found dead, honour killing, vankayagudem, kumar, Police, autopsy report, telangana, Crime

In a suspected honour killing, a man was found dead on Tuesday morning in Vankayagudem village at Tadikal outskirts of Karimnagar.

కరీంనగర్ లో అనుమానిత పరువు హత్య కలకలం..

Posted: 10/09/2018 02:49 PM IST
Telangana man found dead in suspected honour killing in karimnagar

కరీంనగర్ జిల్లాలో మరో పరువు హత్య కలకలం రేపుతుంది. శంకపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన 22ఏళ్ల గడ్డి కుమార్.. వంకాయగూడెం గ్రామ శివారులో రోడ్డుపక్కనే చెట్లలో అతడి మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో పడివుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రేమ వ్యవహారంలోనే అతడిని చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు.. ఇది కచ్చితంగా పరువు హత్యేనని.. అమ్మాయి తరపువారే యువకుడిని హత్యచేశారని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కుమార్ కు మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో ఏడాది క్రితం బాలిక తల్లిదండ్రులు కుమార్ పై నిర్భయ చట్టం కింద్ కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో మృతుడు కుమార్ ఏడాది పాటు జైలులో శిక్షను కూడా అనుభవించాడని పోలీసు కమీషనర్ తెలిపారు. అయితే జైలు నుంచి వచ్చిన కుమార్ నిన్న అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. తన ఇంటి సభ్యులకు ఫోన్ చేసి.. తాను ఇంటికి వస్తున్నానని, వచ్చిన తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని కూడా చెప్పాడని సీపీ తెలిపారు.

అయితే ఆ తరువాత అతని ఫోన్ కూడా స్విచ్ఛాప్ అయ్యింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నుంచి కుమార్ కనిపించడం లేదంటూ అతని కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారని సీపి తెలిపారు. అయితే ఇవాళ ఉదయం అదే గ్రామశివార్లలో కుమార్ విఘతజీవిగా పడివున్నాడని సీపీ తెలిపారు. కుమార్ ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవని, అయితే కుమార్ మరణానికి గల కారణాలు ఏంటన్న వివరాలు తెలియాలంటూ పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు వేచిచూడాలని సిపీ తెలిపారు.

అయితే తాడికల్ గ్రామానికి చెందిన కుమార్… అదే గ్రామానికి చెందిన మరో యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కుమార్ తో పాటు వారి కుటుంబసభ్యులను యువతి తల్లిదండ్రులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. అయినా వారు చాటుమాటుగా కలవడంతో కుమార్ పై నిర్భయచట్టం కింద కేసు కూడా పెట్టారు. దీంతో జైలుకు వెళ్లిన కుమార్ తిరిగివచ్చిన తరువాత ఆదివారం తనకు చివరి కాల్ వచ్చిందని యువతి విలపిస్తూ మీడియాకు చెప్పింది. ఆదివారం రోజున ఓ నలుగురు వచ్చారని… తర్వాత వెళ్లిపోయారని… వాళ్లు తనను బెదిరించారని.. అవసరమైతే తానే వాళ్లను కొట్టడానికి సిద్ధమని కుమార్ చెప్పాడని వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Honour Killing  man found dead  honour killing  vankayagudem  kumar  Police  autopsy report  telangana  Crime  

Other Articles

 • Actress and director vijaya nirmala is no more

  ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

  Jun 27 | అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో... Read more

 • Demolition of praja vedika

  ప్రజావేదిక కూల్చివేత...

  Jun 26 | ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల... Read more

 • Netizens trolls on ongole gang rape case

  ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

  Jun 24 | ఒంగోలులో 16ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ... Read more

 • Kia unveils seltos in india packs it with premium features

  అనంతపురం కియా మోటార్స్ నుంచి తొలి ఎస్.యూ.వీ

  Jun 20 | సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్‌యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్‌తో పాటు విడుదల... Read more

 • Telugu content

  రాంగ్ పార్కింగ్ వాహనదారులకు ఇకపై షాక్..!

  Jun 20 | మీరు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారా ? అయితే జేబుకు చిల్లు పడినట్లే. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా..నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రూ. 10 వేల... Read more

Today on Telugu Wishesh