Blast at Bhilai steel plant kills 9, injures 11 భిలాయ్ స్టీలు ప్లాంటులో భారీ పేలుడు..

Blast at bhilai steel plant nine killed 11 injured say police

Bhilai Steel plant, Bhilai Steel plant blast, Bhilai Steel, Bhilai Steel plant blast updates, Bhilai Steel plant case, Bhilai Steel plant latest news, death toll bhillai, blast, employees, 9 dead, 11 injured, Steel plant blast, chhattisgarh, crime

Nine people have been killed in a gas pipeline explosion at Steel Authority of India plant in Chattisgarh's Bhilai. As many as 14 have been reported to be injured and 5 are in a critical state.

భిలాయ్ స్టీలు ప్లాంటులో భారీ పేలుడు.. 9 మంది మృతి

Posted: 10/09/2018 03:31 PM IST
Blast at bhilai steel plant nine killed 11 injured say police

ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ స్టీటు ప్లాంటులో భారీ పేలు సంభవించింది. స్టీలు ప్లాంట్ లో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఘోర ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా అగ్నికిలలు ఎగసిపడటంతో స్టీల్ ప్లాంటులోని తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. కాగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా వుందని అధికారులు వెల్లడించారు.

ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లాంటులోని కోక్ ఒవెన్ సెక్షన్ సమీపంలోని గ్యాస్ పైప్ లైన్లో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో ప్లాంటులో దాదాపుగా 20 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. 11వ బ్యాటరీ వద్ద మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ లీకైంది. తద్వారా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో అగ్నికిలల్లో చిక్కకుపోయిన తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

ఇక మరో క్షణంలో మంటలు ప్లాంటను కమ్మెయడంతో మరో 14 మంది కార్మికులు గాయపడ్డట్లు స్టీల్ ఫ్లాంట్ ప్రతినిధి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా యత్నించారు. కాగా గాయపడిన వాళ్లను స్థానిక బిలాయి ఆస్పత్రికి తరలించామని, వారిలోనూ ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని దుర్గ్ రేంజ్ ఐజీ జీపీ సింగ్ తెలిపారు. ఈ ప్లాంట్ ను జాతీయ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నిర్వహిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhilai Steel plant  blast  employees  9 dead  11 injured  Steel plant blast  chhattisgarh  crime  

Other Articles

Today on Telugu Wishesh