Amazon, Flipkart dussera offers from tomorrow ఈ కామర్స్ దిగ్గజాల దసరా ఆఫర్లు..

Flipkart vs amazon top offers on latest smartphones tvs

amazon, flipkart, amazon India sale, flipkart big billion days sale, Xiaomi Redmi y2, Xiaomi Smart TV, Honor Play, Samsung Galaxy S9, OnePlus 6, amazon, flipkart, great india sale, big billion day sale, Indian market, e-commerce

E-commerce giants Flipkart and Amazon are hosting mega online sales from October 10. Both the companies are allowing their premium customers an early access to the sale from today

ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దసరా ఆఫర్లు..

Posted: 10/09/2018 12:59 PM IST
Flipkart vs amazon top offers on latest smartphones tvs

ఈ కామెర్స్ (ఆన్ లైన్ మార్కెటింగ్) మన దేశంలో ఇంకా చాలా మేరకు విస్తరించాలన్న సూచనల మాట ఎలావున్నా.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు దసరా పండగ నేపథ్యంలో కస్టమర్లను కట్టిపడేసేలాంటి అఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై పొటీ పెరిగిపోతున్న క్రమంలో ఆ క్యాటగిరిలోకి వచ్చే సెల్ ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రెఫ్రిజిరేటర్లలపై తగ్గింపు ధరలతో ఈ రెండు పోర్టళ్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

అయితే మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఈ రెండు సైట్లను పరిశీలించి.. ధర, ఆఫర్లు, వాటి ఫీచర్లు, ఇలా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకోవాలి. అయితే మీరు ఎంపిక చేసిన వస్తువు కింద.. పాత వాటికి ఇచ్చే ఎక్చైంజ్ ధర లాంటి అంశాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఓ వైపు తగ్గింపు ధరలతో పాటు మరోవైపు ఆఫర్లు, ఉచిత బహుమతులు ప్రకటిస్తున్నాయి. అందుకనే పూర్తిగా స్టడీ చేసిన తరువాతే బెస్ట్ ఆఫర్ తో ముందకు కదలాలి.

ఫ్లిప్ కార్ట్ ఆపర్లు ఇలా వున్నాయి..

* హెచ్డీఎఫ్సీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులపై 10 శాతం రాయితీ.
* వివో వీ9పై రూ.3 వేల తగ్గింపు.. పాతఫోన్‌ మార్పిడిపై రూ.1,000 అదనం.
* వీ9 యూత్‌ ఫోన్ ను రూ.13,990కి, పాతఫోన్‌ మార్పిడిపై రూ.2,000 అదనం.
* వివోఎక్స్‌ 21పై రూ.6,000, వివో వీ11ప్రో, వై81పై రూ.2,000 ప్రకటించింది.
* నోకియా 6.1 ప్లస్‌: 4జీబీ ర్యామ్‌, 64 జీబీ మెమొరీ ఫోన్‌ ధరను రూ.17,600 నుంచి రూ. రూ.14,999కు తగ్గింపు.
* శామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌8: రూ.45,990లో ఆవిష్కరించిన ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.29,999కు వచ్చింది.
* షియామీ రెడ్ మి6: రూ.1000 తగ్గించి రూ.7,999కి, రెడ్ మి నోట్ 5ప్రో తగ్గింపు ధర రూ.12,999.
* ఆసుస్‌ జెన్ ఫోన్‌ 5జడ్‌ తగ్గింపు ధర రూ.24,999. వన్ ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌ తో మార్పిడి చేసుకుంటే, రూ.3 వేలు అదనం
* హానర్‌ 10: రూ.35,999కి ఆవిష్కరించిన ఈ ఫోన్‌ రూ.24,999కి లభించనుంది.
* రియల్‌మి 2ప్రో రూ.13,990కి విక్రయిస్తారు.
* ఓపో ఎఫ్‌9ప్రోను రూ.23,990కి విక్రయిస్తారు.

ఆమెజాన్ ఆపర్లు ఇలా వున్నాయి..

* ఎస్బీఐ డెబిట్‌/క్రెడిట్ కార్డులపై 10 శాతం రాయితీ లభిస్తుంది.
* ఐఫోన్‌ 6 నుంచి టెన్‌ మోడళ్ల వరకు రాయితీపై విక్రయం
* దాదాపు అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ప్రకటన
* వివో వీ9ప్రో ధర రూ.19,990 కాగా, రూ.17,990కి విక్రయించనుంది. వివో నెక్స్‌, వివో వై83 పాత ఫోన్‌ మార్పిడితో రూ.4,000 అదనం.
* రూ.34,999 ధర కలిగిన వన్ ప్లస్‌6 ఫోన్‌ను రూ.29,999కే విక్రయం. దీంతో పాటు రూ.12,000 విలువైన స్ర్కీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్‌.
* హువావె నోవా3ఐ: రూ.23,999కి ఆవిష్కరించిన ఈఫోన్‌ను రూ.17,990కి
* శామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌9: రూ.62,500 విలువైన ఈ ఫోన్‌ను రూ.42,990కి, గెలాక్సీ నోట్ ‌9ని పాత ఫోన్‌ మార్పిడిపై తీసుకుంటే రూ.5,000 అదనపు ఆఫర్‌
* హానర్ ప్లే: రూ.2,000 రాయితీతో రూ.18,999.
* మోటో జీ5ఎస్‌: రూ.16,999కి ఆవిష్కరించిన ఈ ఫోన్‌ రూ.9,999.
* ఎంఐ మిక్స్‌2: రూ.7,000 రాయితీపై రూ.22,999కి, రెడ్ మి వై2 (32 జీబీ)ని రూ.8999కి విక్రయిం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amazon  flipkart  great india sale  big billion day sale  Indian market  e-commerce  

Other Articles