Don't want to politicise Kerala floods: Rahul కేరళకు కేంద్ర సాయం ఏదీ.? రాజకీయం కాదు అవసరం..

Don t want to politicise kerala floods rahul gandhi

kerala reliaf camps, rahul gandhi in kerala, rahul gandhi, kerala floods, kerala rescue ops, central aid, PM Modi, air ambulence, pinarayi vijayan, BJP, Congress, politics

'I have come here as a support and not to politicise Kerala floods', says congress President Rahul Gandhi in Kochi.

ITEMVIDEOS: కేరళకు కేంద్ర సాయం ఏదీ.? రాజకీయం కాదు అవసరం..

Posted: 08/29/2018 04:56 PM IST
Don t want to politicise kerala floods rahul gandhi

భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైన కేరళకు కేంద్ర ప్రభుత్వం సరైన సాయం చేయట్లేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రకృతి వైపరిత్యానికి గురై అతలాకుతలమైన అనేక బతుకులు ఇంకా సహాయశిభిరాల్లోనే వున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత యుద్దప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టినా.. కేంద్రం నుంచి మాత్రం ఇంకా తగిన సాయం అందడం లేదని పేర్కోన్నారు. అయితే ఈ విషయాన్ని తాను రాజకీయం చేయడం లేదని, కానీ ఇక్కడ బాధితుల కష్టాలు చూసి తాను కేంద్రం వెంటనే సాయం చేయాలని కోరుతున్నానని అన్నారు.

కేరళలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరైన విధంగా సాయం చేయకపోవడం పట్ల నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వరద బాధితులు సాయం పొందడం వారి హక్కు. బాధితుల పక్షాన నేను మాట్లాడాల్సి ఉంది. నేను ఈ విషయాన్ని రాజకీయం చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు. యూఏఈలాంటి దేశాల నుంచి విరాళాలు తీసుకునే అంశంపై ఆయన స్పందిస్తూ.. తాను విదేశాల నుంచి విరాళాల సేకరణకు మద్దతు తెలుపుతానని అన్నారు. ‘కేరళ ప్రజలు కష్టాలను అధిగమించేందుకు ఎవరైనా భేషరతుగా విరాళాలు ఇస్తే నేను తీసుకోమనే చెబుతాను’ అని అన్నారు.

తాను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని, ఆ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సహాయక చర్యలను నిర్వహిస్తోందని రాహుల్‌ గాంధీ ప్రశంసించారు. అలాగే, వరద బాధితులకు ప్రకటించిన రూ.10,000 సాయాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సహాయక శిబిరాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నానని చెప్పారు. కాగా, నిన్న ఆలప్పుళా, ఎర్నాకులం, త్రిశూర్‌ జిల్లాల్లో పర్యటించిన రాహుల్‌.. వరద బాధితులకు సాయం చేయాలని తమ పార్టీ కార్యకర్తలను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  kerala floods  central aid  PM Modi  air ambulence  pinarayi vijayan  BJP  Congress  politics  

Other Articles