SC directs police to keep activists house arrest ప్రధాని హత్యకు కుట్ర కేసులో వారికి తాత్కాలిక ఊరట

Sc directs pune police to keep activists under house arrest

Supreme court, Varavara Rao, lawyer Sudha Bharadwaj, Arun Fereira, Gautam Navlakha, Vernon Gonsalves, Pune Police, elgaar parishad, elgaar parishad event, elgaar parishad activists arrested, bhima koregaon violence

The Supreme Court, hearing the petition filed by Historian Romila Thapar and others against the arrests of five activists in relation to Bhima Koregaon violence, directed Pune police to keep them under house arrest

ప్రధాని హత్యకు కుట్ర కేసులో వారికి తాత్కాలిక ఊరట

Posted: 08/29/2018 05:33 PM IST
Sc directs pune police to keep activists under house arrest

ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నారని, అందుకు అవసరమైన నిధులు తదితరలాను సమకూర్చే బాధ్యతలను నెత్తికెత్తుకున్నారన్న అభియోగాలను మోపుతూ.. మావోయిస్టుల సానుభూతిపరులనే ఆరోపణలతో అరెస్టు చేసిన ఐదుగురిలోని ముగ్గురు నేతలను కూడా గృహ నిర్బంధంలోనే ఉంచాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. భీమా-కొరెగావ్ హింసాత్మక సంఘటనల కేసులో వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
 
వరవరరావు, గౌతమ్ నవలఖ, సుధ భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొంజాల్వెస్ లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు పేర్కోంటున్నారు. కాగా,
అరెస్టయిన ఐదుగురిలో ఇద్దరు ఇప్పటికే హైకోర్టుల ఆదేశాల మేరకు గృహ నిర్బంధంలో ఉన్నందు వల్ల మిగిలినవారిని కూడా అదే విధంగా గృహ నిర్బంధంలో ఉంచాలని, ఎవరి ఇళ్ళలో వారినే వచ్చే నెల 6 వరకు ఉంచాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.
 
విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యపు సురక్షిత కవాటం అని.. దానిని అనుమతించకపోతే, ప్రెషర్ కుక్కర్ పేలిపోతుందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ ఇది చాలా ఆశ్చర్యకరమైన కేసు అని పేర్కొన్నారు. నిందితుల తరపున పరిచయం లేనివారు బెయిలు పిటిషన్లను దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే వీరి అరెస్టులను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles