Hari Rama Jogayya's son joined Janasena చేగొండితో పవన్ సమావేశం.. జనసేనలోకి సూర్యప్రకాశ్

Hari rama jogayya s son joined janasena

pawan kalyan, janasena, JanaSena Porata Yatra, Bhimavaram, Narsapuram, Chegondi Surya Prakash, Chegondi Hari Rama jogayya, west godavari, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in west godavari went to Hari Rama Jogayya house and discussed about strategies to be employed by Janasena as well as the current ground level report on all political parties including Janasena.

చేగొండితో పవన్ సమావేశం.. జనసేనలోకి సూర్యప్రకాశ్

Posted: 08/11/2018 05:08 PM IST
Hari rama jogayya s son joined janasena

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ పార్టీ జనసేనలోకి చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలే కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ ఆయన ఇద్దరు కుమారులను పవన్ జనసేనలోకి ఆహ్వానించగా.. ఆయన అంగీకరించారు. లాంఛనంగా పార్టీలో చేరేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా హరి రామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ ఆ పార్టీలో చేరారు. జనసేన పోరాట యాత్ర పేరిట జనంలోకి వెళ్తున్న పవన్.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన సభ విజయవంతం అయిన తరువాత అక్కడి నుంచి ఆయన భీమవరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పాల్లకొల్లు వద్దకు చేరుకోగానే.. సీనియర్ నటుడు, కాపు సామాజిక వర్గ నేత హరి రామజోగయ్యను నివాసానికి వెళ్లిన ఆయన అక్కడ సుమారు గంట పాటు సమకాలీన రాజకీయాలపై చర్చించారు. ఇదే సమయంలో జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను జోగయ్య అభినందించారు.

 ప్రజల సంక్షేమమే, అభున్నతే కాంక్షగా పొరాటం చేయడంతో రాజకీయాలలో నిరాడభ్రతను తీసుకువస్తున్నారని పవన్ తో జోగయ్య అన్నారు. జనసేనాని పవన్ రాజకీయాలలో తీసుకువస్తున్న మార్పులతో సామాన్య నాయకులకు కూడా అధినేతను కలిసే అవకాశం వుంటుందని, వీరితో పాటు సామాన్య ప్రజలు కూడా అధినేతతో కలసి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం వస్తుందని అన్నారు. పార్టీ అధినేతల చుట్టూ వుండే కోఠారీ వ్యవస్థ ప్రభావం తగ్గిపోయి.. ప్రజలు నేరుగా నేతను కలిసే అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు.

కుల, మత, ప్రాంతలవారీగా కాకుండా.. మనుషులుగా అంతా ఒక్కటనే భావన ఏర్పడటానికి.. రాజకీయాల కోసం మనుషుల గణన చేయడం దారుణమని, దానిపై కూడా పోరాటం చేస్తున్న పవన్ కల్యాన్ ను జోగయ్య కొనియాడారు. పవన్ రాజకీయ చతురతను, ప్రస్తుత రాజకీయలను అధ్యయనం చేసిన తీరును కూడా ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య తాను రచించిన '60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకాన్ని బహూకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles