Atal Bihari Vajpayee Critical మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అరోగ్యం మరింత విషమం

Atal bihari vajpayee in critical condition placed on life support system

atal bihari vajpayee,atal bihari vajpayee health,atal bihari health, atal bihari vajpayee, crtical, aims, new delhi, gwalior, special flights, security, hospital, vajpayee house

Former Prime Minister Atal Bihari Vajpayee remained "critical and on life support" at the AIIMS here on Thursday, a hospital statement said. These are the diseases he's been dealing with

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం మరింత విషమం

Posted: 08/16/2018 01:11 PM IST
Atal bihari vajpayee in critical condition placed on life support system

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం మరింత క్షీణించిందన్న. గడచిన కొన్ని వారాలుగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో న్యూఢిల్లీలోని ఆయన నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది.కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి మీడియా అండ్ ప్రొటోకాల్ డివిజన్ చైర్ పర్సన్ డాక్టర్ అరిల్ విజు అటల్ బిహారీ వాజ్ పాయ్ అరోగ్యం విషయమై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

"మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గత 9 వారాలుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. దురదృష్టవశాత్తూ, గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన్ను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచాం" అని పేర్కొన్నారు. మరోవైపు వాజ్ పేయి ఆరోగ్యం మరింతగా క్షీణించిందన్న సమాచారం అందుకున్న ఆయన బంధువులు గ్వాలియర్ నుంచి హుటాహుటిన న్యూఢిల్లీకి బయలుదేరారు. వారిని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలువడటంతో, బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేషనల్ కాన్షరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వద్దకు రాగా, మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి ఆసుపత్రికి రానున్నారని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది, ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. అలాగే వాజ్ పేయి ఇంటి వద్ద కూడా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.

వాజ్ పేయి నివాసానికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు పలు కీలక రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి, రహదారిని బ్లాక్ చేయడంతో సర్వత్ర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయన్ను పరామర్శించేందుకు బీజేపీ అగ్రనేతలు ఆసుపత్రి ముందు క్యూ కట్టగా, వాజ్ పేయి అభిమానులు తీవ్ర ఆందోళనతో తమ ప్రియనేత కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atal bihari vajpayee  crtical  aims  new delhi  gwalior  special flights  security  hospital  vajpayee house  

Other Articles