No proposal to withdraw Rs 2000 notes రూ. 2000.. ఛస్.. అంతా ఉత్తదే.. ప్రభుత్వం క్లారిటీ

No proposal to withdraw pink rs 2000 notes says govt in lok sabha

Specified Bank Notes, RBI, notes, Indian Government, bank branches, Demonetisation, rupee note, Rs 2000 note, RBI, note ban, currency note, rupee currency, Economy, Policy, India Business News, Business News, parliament

The government said that there is no proposal to withdraw the Rs 2,000 denomination note, which was introduced by RBI following the demonetisation of high-value Rs 500 and Rs 1,000 notes on November 8th 2016.

రూ. 2000.. ఛస్.. అంతా ఉత్తదే.. ప్రభుత్వం క్లారిటీ

Posted: 08/11/2018 12:08 PM IST
No proposal to withdraw pink rs 2000 notes says govt in lok sabha

పెద్ద నోట్ల రద్దు పేరుతో అప్పటి వరకు చెలామణిలో వున్న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వున్న వెయ్యి నోటుకు వందశాతం అధికమైన రూ. రెండు వేల నోటును చలామణిలోకి తీసుకువచ్చింది. అయితే ఈ నోటును చలామణిలోకి తీసుకురావడంతో ముందుగా చిల్లర సమస్య ఉత్పన్నమైంది. ఆ తరువాత రూ. 2 వేల నోటు కనినించడమే కష్టమైంది. దీంతో దేశ ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నోటును కూడా ప్రభుత్వం ఉపసంహరిస్తుందన్న పుకార్లు వినిపించాయి.

దీంతో రూ. 2 వేల నోట్లు వున్నా.. వంద రూపాయలు వున్నావాడే ధనవంతుడని భావించిన రోజులను కూడా దేశప్రజలు వీక్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షానికి చెందిన సభ్యులు ప్రభుత్వం రెండు వేల నోట్లను ఉపసంహరించుకోనుందా.? అంటూ నేరుగా పార్లమెంటులోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దీనిపై బదులిస్తూ కేంద్రం అలాంటిదేమీ లేదని గతంలోనే స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న క్రమంలో మరోమారు ఎంపీలకు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో మరోమారు సభ్యులు లోక్ సభలో ప్రశ్నించారు.

అయితే రెండు వేల రూపాయల నోటుపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం మరోమారు స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. రూ.2 వేల నోటును ఉపసంహరించుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఈ నోటును ఉపసంహరించుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. దేశంలో పెరిగిపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని  మంత్రి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  rupee note  Rs 2000 note  RBI  note ban  currency note  rupee currency  Economy  Policy  

Other Articles