No Urgent Hearing on Hindu Mahasabha Plea: SC కుమారస్వామి ప్రమాణస్వీకారానికి తొలగిన అడ్డంకులు

No urgent hearing on hindu mahasabha plea against kumaraswamy sc

supreme court, Kumara swamy, akhila bharata hindu mahasabha, vaju bhai wala, Siddaramaiah, BJP, Congress, JD(S), karnataka, politics

Supreme court refused to give an early hearing to the petition filed by Hindu Mahasabha that challenged the oath taking ceremony and appointment of HD Kumaraswamy as the Karnataka chief minister, stating it is unconstitutional.

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి తొలగిన అడ్డంకులు

Posted: 05/22/2018 12:18 PM IST
No urgent hearing on hindu mahasabha plea against kumaraswamy sc

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. దక్షిణాది కర్ణాటక రాష్ట్రం నుంచే బీజేపి పతనం ప్రారంభమవుతుందని.. వారు చేసే శతవిధాల ప్రయత్నాలను ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఏకమై తప్పికొడతామని చెప్పిన కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తాను మాటలకే కాదు చేతలకు కూడా కట్టుబడి వుంటానని జేడీఎస్ తో పోత్తుకు సై అన్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ పోత్తు అనైతికమని, కర్ణాటకలో ప్రజా తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని వాదిస్తున్న బీజేపి రాష్ట్రంలో మరోమారు ఎన్నికలు నిర్వహించాలని కూడా సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఇది చాలదన్నట్లు అఖిల భారత హిందూ మహాసభ కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం రాజ్యంగ విరుద్ధమని, దాన్ని అడ్డుకోవాలని కోరింది.

కాంగ్రెస్, జేడీఎస్ జతకట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన అఖిల భారత హిందూ మహాసభ.. కుమారస్వామి ప్రమాణస్వీకారాన్ని చేపట్టకూడదన్న పిటీషన్ ను అర్జెంటుగా విచారించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ పై ముందస్తు విచారణకు చేయాల్సిన అవసరం లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో బుధవారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి కుమారస్వామి వున్న అడ్డంకులు పూర్తిగా తొలిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles