Former Agrigold board member Sitarama rao arrested అగ్రీగోల్డ్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాస్ సీతారామారావు అరెస్ట్..

Former agrigold board member sitarama rao arrested

agri gold, sitaramarao, delhi, cid police, arrest, avva venkata rama rao, cid, Gurgaon, cid police, andhra pradesh, crime

Former Agri gold board member and Vice President A.sitarama rao had been arrested at New Delhi on Tuesday. A team of CID police arrested Sitarama Rao.

అగ్రీగోల్డ్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాస్ సీతారామారావు అరెస్ట్..

Posted: 05/22/2018 11:30 AM IST
Former agrigold board member sitarama rao arrested

అగ్రీగోల్డ్ మోసం బయటకు వచ్చినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడు అవ్వాస్ సీతారాం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. గత కొంతకాలంగా సీతారాంను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన అధికారులు, ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని తెలుసుకుని ట్రాప్ చేశారు. సీతారాంను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు, ఢిల్లీలో సీతారాంను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆది నుంచి సీతారాం ప్రమేయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

అగ్రిగోల్డ్ కేసులో అవ్వాస్ సీతారామారావు అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకొంది. దీంతో ఇకపైనైనా ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందన్న అశాభావం అగ్రీగోల్డ్ బాధితుల నుంచి వ్యక్తమవుతుంది. ముందస్తు బెయిల్ ను న్యాయస్థానం నిరాకరించిన నాటి నుంచి అజ్ఞాతం బాట పట్టి తప్పించుకుని తిరుగుతున్న సీతారామారావును అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ నుంచి విజయవాడకు త్వరలో తరలించనున్నారని సమాచారం.

అగ్రిగోల్డ్ కు చెందిన ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ సమయంలో ఎస్సెల్ కంపెనీ ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఎస్సెల్ కంపెనీ ఈ ఆస్తులు కొనుగోలు చేయకుండా సీతారామారామారావు అడ్డుకొన్నారని సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు కూడ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఛైర్మెన్ వెంకటరామారావును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సోదరుడు సీతారామారావును అరెస్ట్ చేయకపోవడంపై బాధితులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సీతారామారావు అరెస్ట్ తో ఈ కేసు మరింత కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదని బాధితులు అభిప్రాయపడుతున్నారు.

2011 వరకు అగ్రిగోల్డ్ బోర్డు మెంబర్ గా సీతారామారావు కొనసాగారు. అయితే అదే సంవత్సరంలో ఆయన బోర్డు మెంబర్ పదవి నుండి తప్పుకొన్నారు. న్యూఢిల్లీలో ఉన్న సీతారామారావును ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. సీతారామారావునును విచారిస్తే ఈ కేసు విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.మరో వైపు అగ్రి గోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు పరిహారం చెల్లించే ప్రయత్నాలు సాగుతున్నాయి..అగ్రిగోల్డ్ సంస్థకు ఎక్కడెక్కడ ఏఏ ఆస్తులున్నాయనే విషయమై సీతారామారావుకు తెలిసి ఉంటుందని బాధితులు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agri gold  sitaramarao  delhi  cid police  arrest  avva venkata rama rao  cid  Gurgaon  cid police  andhra pradesh  crime  

Other Articles