retired ias got key post in pawan kalyans' janasena జనసేనలో రిటైర్డు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు

Retired ias pickedup for key post in pawan kalyans janasena

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan janasena, janasena party general sectratary, thota chandra shekar ias, praja rajyam, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan appoints retired ias officer thota chandrashekar as party general secretary, who was made distance from politics after contesting elections from praja rajyam party 10 years ago.

జనసేనలో రిటైర్డు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు

Posted: 05/22/2018 12:49 PM IST
Retired ias pickedup for key post in pawan kalyans janasena

రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చిన మహారాష్ట్ర మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్.. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. అయితే చంద్రశేఖర్ కొంతకాలం కిందే జనసేనలోకి చేరినా.. ఆయన పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన పవర్ స్టార్ మాత్రం ఆయకు తాజాగా కీలక బాధ్యతలను అప్పగించారు. ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయన్న విషయాలతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయాలపై కూడా చక్కని అవగాహన వుంది.

ఈ నేపథ్యంలో తొట చంద్రశేఖర్ కు పవన్ కల్యాణ్ పార్టీలో ప్రాధాన్యత కల్పించడంతో పాటు ప్రముఖ స్థానం కూడా అందించారు. ఏకంగా ఆయనను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన చంద్రశేఖర్, 2008 వరకూ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతానికి చెందిన తోట చంద్రశేఖర్ తన పదవీ విరమణ తరువాత.. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పట్ల అకర్షితులై ఆ పార్టీలో చేరారు. గుంటూరు నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా వుండిపోయారు.

ఇటీవల జనసేనలో చేరిన చంద్రశేఖర్, అప్పటి నుంచి పవన్ కు సన్నిహితుడిగా మారి, సలహాలు, సూచనలు ఇస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రశేఖర్ ను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనూ నియమించిన పవన్, ఏపీకి వచ్చిన నిధుల లెక్కలు బయటకు తీయడంలో ఆయన పడిన శ్రమను గుర్తించారు. ఇప్పుడాయనకు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు లేదా గుంటూరు లోక్ సభ స్థానానికి ఆయన పోటీ పడవచ్చని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  general secretary  thota chandra shekar  IAS  andhra pradesh  politics  

Other Articles