pawan kalyan surrenders his gunmen security జనసేనపై నిఘా.. గన్ మెన్లను వెనక్కు పంపిన పవర్ స్టార్

Pawan kalyan surrenders his gunmen security to government

pawan kalyan, janasena, guntur, mangalagiri, security, gunmens, private security, left parties, Pawan Kalyan guntur meeting, pawan kalyan press meet, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan surrenders his gunmen security to government, who were appointed on his request to DGP on 14th march, but rumours spread that they are spying power star.

జనసేనపై నిఘా.. గన్ మెన్లను వెనక్కు పంపిన పవర్ స్టార్

Posted: 04/18/2018 10:43 AM IST
Pawan kalyan surrenders his gunmen security to government

రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన అధ్యక్షుడిపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా నేత్రాన్ని పెట్టింది. అసలు ఆయన ఏం చేస్తున్నారు... ఏం చేయబోతున్నారన్న విషయాలను ముందుగానే తెలుసుకుని వాటికి కౌంటర్ గా మరో కార్యక్రమాన్ని నిర్వహించి.. ఇక మేమే ముందుగా చేశామని చెప్పుకునే చర్యలకు పాల్పడుతుంది. అయితే తమ కార్యక్రమాల సమాచారం.. ఎలా లీక్ అవుతుందో పసిగట్టిన పవర్ స్టార్ ప్రభుత్వం తనకు కేటాయించిన గన్ మెన్లు ఈ చర్యలకు పాల్పడుతున్నారని గ్రహించారు. దీంతో పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపి తనకు కేటాయించిన 2+2 గన్ మెన్లను ఆయన వెనక్కి పంపించారు.  భద్రతా సిబ్బందిని ప్రభుత్వం నిఘా కోసం వాడుకుంటోందనే అనుమానంతో పవన్ వారిని తిప్పి పంపినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ అంతర్గత విషయాలు, సమావేశాల వివరాలు మొదలైనవి లీక్ అవుతున్నాయని పవన్ భావిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు నలుగురు గన్ మెన్లకు ఈ విషయాన్ని తెలిపిన పవన్ సిబ్బంది, ప్రభుత్వానికి సరెండర్ కావాలని సూచించారు.

గత నెల 14న గుంటూరులో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ముందు తనకు సెక్యూరిటీ కావాలని రాష్ట్ర డీజీపీని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. అయితే ఆయన వినతి మేరకు స్పందించిన డీజీపీ.. రాష్ట్ర హోంశాఖ అనుమతి మేరకు 2+2 గన్ మెన్లను కేటాయించారు. ఈ గన్ మెన్ లను ఏర్పాటు చేసిన నెల తర్వాత, వారిని పవన్ వెనక్కి పంపించి ప్రభుత్వానికి సరెండర్ కావాలని సూచించారు. ఇక తనకు తన సైన్యమే అండగా వుంటారని, అభిమానులే ప్రపంచంలా వున్న తనకు వారే రక్షణగా వుంటారని జనసేన వర్గాలు తెలిపాయి. ‘జనసేన’లో జరుగుతున్న వ్యవహారాలను కనిపెట్టేందుకే ప్రభుత్వంలోని పెద్దలు తనకు సెక్యూరిటీ కల్పించినట్టు పవన్ భావిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  guntur  mangalagiri  security  gunmans  surrender  left parties  andhra pradesh  politics  

Other Articles