Akshaya Tritiya Offers On Gold, Diamond Jewellery అక్షయ తృతీయ: బంగారం కొనేందుకు భలే మంచి భేరాలు

Akshaya tritiya 2018 the best offers on gold diamond jewellery

Akshaya Tritiya, leading jeweller, Best Offers, Gold, Diamond Jewellery, Tanishq, Malabar Gold & Diamonds, PC Jeweller, flipkart, e-commerce, business

In order to cash in on Akshaya Tritiya, leading jewellers have lined up attractive offers for buyers. Tanishq, Malabar Gold & Diamonds and PC Jeweller on gold, diamond jewellery.

అక్షయ తృతీయ: బంగారం కొనేందుకు భలే మంచి భేరాలు

Posted: 04/17/2018 05:33 PM IST
Akshaya tritiya 2018 the best offers on gold diamond jewellery

అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు చేస్తే మంచి జరుగుతుందని, ఇక ఏడాది పాటు బంగారం కొంటూనే వుంటామని కొందరు విశ్వసిస్తారు. ఈ శుభదినాన పసిడిని కొనుగోలు చేసేందుకు అందరూ ఇష్టపడతారు. ఉత్తర భారత దేశానికి చెందిన ఈ అనవాయితీ క్రమంగా దక్షిణాదికి కూడా పాకి.. మహిళలను బంగారు వజ్రాభరణ దుకాణాల వైపు పరుగులు పెట్టిస్తుంది. ఇక మహిళామణుల నమ్మకాన్ని తమకు అనుగూణంగా అన్వయించుకున్న బంగారు వ్యాపారులు.. తమ అమ్మకాలకు ఇది  ఓ చక్కని అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇక తమ షాపులోనికే మహిళామణులు రావాలని వారికి ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు.

* బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 25 శాతం తగ్గింపును తనిష్క్ ప్రకటించింది. ఈ నెల 18 వరకే ఈ అవకాశం. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చు.

* మలబార్ గోల్డ్ ప్రతీ రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై 150 మిల్లీగ్రాముల బరువుగల ఒక బంగారం కాయిన్ ను ఉచితంగా అందిస్తోంది. దీనికి అదనంగా కొనుగోలులో 5 శాతం విలువకు సరిపడా గిఫ్ట్ కార్డు లభిస్తుంది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు ఉంటాయి.

* అత్యంత తక్కువ ధరలకే తాము బంగారు నాణేలాను అందిస్తామని, దీనికి తోడు వాటిపై రమారమి  7 శాతం వరకు రాయితీ కూడా ఇస్తామని పీసీ జ్యూవలరీ సంస్థ ప్రకటించింది. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు బుక్ చేస్తే మాత్రం అదే రోజున షిఫింగ్ కు అర్డర్ చేస్తారని ఈ కంపెనీ వెబ్ సైట్ లో పేర్కోనింది.

* ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles