TN governor pats journo on cheek, sparks controversy గవర్నర్ చర్యపై.. మహిళా జర్నలిస్టు అవేదన..

Governor banwarilal purohit should ve submitted himself to the investigation

DMK Rajya Sabha MP Kanimozhi, Lakshmi Subramanian, Tamil Nadu Governor Banwarilal Purohit, Woman journalist, governor sparks controversy, Chennai, Banwarilal Purohit, sex for degress case, Raj Bhavan,Nirmala Devi, madurai kamaraj university, Tamil Nadu

Tamil Nadu Governor Banwarilal Purohit courted controversy on Tuesday when he diplomatically patted a woman journalist, apparently to parry a question, with the DMK terming the incident as "unbecoming" of a person holding a Constitutional post.

గవర్నర్ చర్యపై.. మహిళా జర్నలిస్టు అవేదన..

Posted: 04/18/2018 11:35 AM IST
Governor banwarilal purohit should ve submitted himself to the investigation

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు అమె ఎవరో కూడా తనకు తెలియదని చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్ తనను అసభ్యంగా తాకడం ఎంతవరకూ సబబని, మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్ధతా? అని తమిళనాడు మహిళా జర్నలిస్టు ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్ ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’  అంటూ ట్వీట్‌ చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనే ఇలా తన అనుమతి లేకుండా తన చెంపపై చేయి వేయడం సబబు కాదని తెలియదా అంటూ ప్రశ్నించారు. ఒక అడపిల్ల పట్ల సభ్యతా, సంస్కారం తెలిసిన వ్యక్తిగా, రాష్ట్ర గవర్నర్ హోదాలో వున్న మీరు నా ప్రశ్నకు నా చెంపపై చేయి వేయడం సమాధానం అనిపించుకోదని అమె తన అవేదన వ్యక్తం చేశారు. "నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నా ఆ మురికి వదిలినట్లు నాకు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయసులో ఉన్న మీరు నాకు తాతయ్య వంటి వారే కావచ్చు. కానీ మీ ప్రవర్తన నాకు తప్పుగా అనిపిస్తోంది" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఈ సంఘటనపై విపక్ష డీఎంకే నిప్పులు చెరిగింది. గవర్నర్ చర్యను ఖండిస్తూ, ఉన్నత స్థితిలో ఉన్న గవర్నర్ చేసిన పని మంచిది కాదని ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చని, ఓ యువతి గౌరవానికి భంగం కలిగించడం మాత్రం సభ్యత అనిపించుకోదని ట్వీట్‌ చేశారు. గవర్నర్ స్థానంలో వున్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమో వారికే తెలియాలని అమె తన ట్వీట్ లో పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles