Priyanka Gandhi gave a dressing down to unruly crowd నినాదాలిస్తున్న పార్టీ అభిమానులపై ప్రియాంకా గాంధీ ఫైర్..

Watch priyanka gandhi gave a dressing down to unruly crowd

Priyanka Gandhi, unnao, Rahul Gandhi, Kathua, Robert Vadra, India gate, crime against women, PM Narendra Modi, Modi government, violence against women, rape, gangrape

Congress president Rahul Gandhi’s sister Priyanka Gandhi Vadra lost her cool during a midnight protest march in Delhi against the Unnao and Kathua rape incidents. After being pushed and jostled, Priyanka rebuked the unruly crowd, saying people should “at least respect the cause”

ITEMVIDEOS: నినాదాలిస్తున్న పార్టీ అభిమానులపై ప్రియాంకా గాంధీ ఫైర్.. నెట్ లో వైరల్

Posted: 04/13/2018 12:27 PM IST
Watch priyanka gandhi gave a dressing down to unruly crowd

దేశంలో మరీ ముఖ్యంగా దేశ రాజధానిలో మహిళలపై జరుగుతున్న నేరాలు, అత్యాచారాలను కట్టడి చేయడంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ అరోపించింది. ఈ నేపథ్యంలో క్రితంరోజు అర్థరాత్రి కాంగ్రెస్ నేతలు క్యాండిల్ లైట్ పాదయాత్రను నిర్వహించారు. మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావో, జమ్ముకాశ్మీర్ లోని ఖతువా అత్యాచార బాధితులకు అండగా నిలుస్తామన్న అభయాన్ని ఇస్తూ, ఖతువా బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఉన్నావ్ బాధితురాలి తండ్రి అత్మకు కూడా శాంతి చేకూరాలని క్యాండిల్ లైట్ యాత్ర చేపట్టారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్ర, అమె భర్త రాబర్ట్ వాద్రా, వారి పిల్లలతో పాటు కాంగ్రెస్ నేతలు, ముఖ్యులు, పార్టీ కార్యకర్తలు, ఇలా వందలాది మంది ఢిల్లీ వీదులు నిర్మానుష్యంగా మారిన క్రమంలో నడిరోడ్లపై శాంతియుతంగా శాంతియాత్రను కొనసాగించారు. అయితే గమ్యస్థానానికి చేరకునే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రాహుల్ అభిమానులు కొందరు రాహుల్ గాంధీ నాయకత్వం అంటూ నిరసన తెలుపుతూ సాగుతున్న శాంతియాత్రను కాస్తా.. రాజకీయ యాత్రగా మార్చేసారు.  దీంతో అభిమానులు చేస్తున్న హంగామాపై ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.

ఈ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామో తెలుసుకోకుండా నినాదాలు ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ అల్లరి చేసేవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని గద్దించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండి, మాట్లాడకుండా నడవాలని సూచించారు. ఏ కారణంతో ఇక్కడికి వచ్చామో అర్థం చేసుకుని బాధ్యతగల పౌరుల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాగా, తన భర్త రాబర్ట్ వాద్రాతో కలసి వచ్చిన ఆమె, ఇండియా గేట్ వద్ద రాహుల్ నిరసనలో జత కలిశారు. ఈ దేశం తమకు భద్రత నిస్తుందని ప్రతి మహిళా నమ్మేలా పరిస్థితులు మారాల్సి వుందని ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ అభిప్రాయపడ్డారు.

శాంతియాత్ర తరువాత ఇండియా గేట్ కు చేరుకున్న తరువాత కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహిళల పట్ల నేరాలు సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, వాటిని నియంత్రించడంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సహా బీజేపి పాలిత రాష్ట్రాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయని అయన అన్నారు. అయితే మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా తాము ఈ శాంతిర్యాలీనిన నిర్వహించామమని, ఇది జాతీయ సమస్యగా పేర్కోన్న ఆయన ఇందులో రాజకీయ కోణాన్ని చూడలేమని అన్నారు. ఇది మన మహిళల కోసం, ఇంటి ఆడపడచుల కోసం చేస్తున్న పాదయాత్ర అని చెప్పారు. కేంద్రం ఆ దిశగా మహిళ రక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Gandhi  unnao  Rahul Gandhi  Kathua  Robert Vadra  India gate  crime against women  

Other Articles

Today on Telugu Wishesh