pawan kalyan extends support to ap bandh on 16th రాష్ట్రబంద్ కు జనసేనాని పవన్ మద్దతు..

Pawan kalyan extends support to ap bandh on 16th

pawan kalyan, janasena, left parties, pawan kalyan press meet, andhra pradesh bandh, ap special status sadhana samiti, andhra pradesh bandh, chalasani srinivas, ap special status, union government, congress, TDP, politics, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan extends his support to ap special status sadhana samiti's bandh call, hence forth he cancels all his agitation programs in anathapur, vizianagaram, ongole.

రాష్ట్రబంద్ కు జనసేనాని పవన్ మద్దతు.. 15న సభలు వాయిదా

Posted: 04/13/2018 11:38 AM IST
Pawan kalyan extends support to ap bandh on 16th

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించడంతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కోన్న హామీలన్నింటిని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నెరవేర్చాలన్న డిమాండ్ తో రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 16న జరగనున్న రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతును ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా రాష్ట్ర బంద్ లో పాల్గోని.. బంద్ ద్వారా తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు.

అందుకోసం తమ పార్టీ ఇదివరకే ప్రకటించిన పలు నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో వామపక్ష నేతలతో భేటీ అయిన అనంతరం.. తాము ఈ నెల 15న తలపెట్టిన అనంతపురం, విజయనగరం, ఒంగోలు సభలను నిర్వహించాలని తలపెట్టామని, అయితే ఆ తరువాతి రోజునే రాష్ట్ర బంద్ కు ప్రత్యేక హొదా సాధన సమితి పిలుపునివ్వడంతో.. బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించిన పవన్ కల్యాన్.. తాను ఈ నెల 15న తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రబంద్ నేపథ్యంలో విజయనగరం, ఒంగోలు, అనంతపురం పట్టణాల్లో నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలనూ నిలిపివేసినట్టు పవన్ తెలిపారు. వామపక్షాల నేతలతో సమావేశమైన పవన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతు, కార్మికుల సమస్యలపై పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పిన ఆయన, ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా తాము మద్దతిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాలకుడై వుండి తానే నిరసన వ్యక్తం చేయడం.. దేశ ప్రజలను మోసం చేయడమేనని అరోపించారు. మోదీ వైఖరిని ఇప్పుడు ప్రజలంతా అపహాస్యం చేస్తున్నారని అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చుంటే ఎన్నో నిజాలు బయటకు వచ్చుండేవని పవన్ కల్యాన్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles