Justice Chelameswar vents anguish over affairs in SC ‘‘నా ఇబ్బందిని అర్థంచేసుకోండి’’: పిటీషనర్ తో ‘సుప్రీం’ న్యాయమూర్తి

Justice chelameswar refuses to hear plea on allocation of work in sc

Dipak Misra, CJI, Justice Chelameswar, judicial appointments, Ranjan Gogoi, Kurian Joseph, Karnataka High Court, Dinesh Maheshwari, P Krishna Bhat, Chief Justice of Karnataka High Court

The Supreme Court's most senior judge, Justice J Chelameswar, today again expressed anguish over the affairs in the apex court and refused to order listing of a PIL filed by former union Law Minister Shanti Bhushan seeking formulation of guidelines on allocation of cases.

‘‘నా ఇబ్బందిని అర్థంచేసుకోండి’’: పిటీషనర్ తో ‘సుప్రీం’ న్యాయమూర్తి

Posted: 04/13/2018 01:00 PM IST
Justice chelameswar refuses to hear plea on allocation of work in sc

ధేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన వద్ద పిటీషన్ వేసిన పిటీషనర్ తో తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని అభర్దించారు. ఇటీవలే అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా కొనసాగుతన్న నలుగురు సీనియర్ న్యాయమూర్తులు న్యాయవ్యవస్థపై, ఇలా కొనసాగితే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై చూపే ప్రభావాన్ని చాటి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించారు. తాజాగా అదే తరహా కేసులో వచ్చిన పిటీషన్ పై జస్టిస్ చలమేశ్వర్ కూడా తాను విచారణ చేపట్టి ఇచ్చే తీర్పు.. తిరస్కరణకు గురికావద్దని, అందుచేత తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని న్యాయమూర్తి పిటీషనర్ ను కోరారు.

ఇంతకీ ఎవరా న్యాయమూర్తి, ఎవరా పిటీషనర్..? అంటే.. ఆయన మరెవరో కాదు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మరోసారి ఆవేదనను వ్యక్తం చేశారు. కేసుల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని దాఖలైన ఓ పిటిషన్ ను తాను విచారించలేనని, ఈ కేసును విచారించి తీర్పు ఇస్తే, దాన్ని తిరస్కరిస్తారని అన్నారు. తన మరో తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని తాను కోరుకోవడం లేదని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని కోరారు.

సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకూ చీఫ్ జస్టిసే సుప్రీం అంటూ నిన్న ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పిన నేపథ్యంలో, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాలు ఉండాలంటూ కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును అత్యవసరంగా విచారించేందుకు చలమేశ్వర్ నిరాకరించారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని సవాల్ చేస్తున్న పిల్ కాబట్టి చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్లలేదని పిటిషనర్ చెప్పగా, ఈ అంశంలో తాను జోక్యం చేసుకోలేనని చలమేశ్వర్ స్పష్టం చేశారు. అందుకు కారణాలు కూడా అందరికీ తెలుసునని అన్నారు. కాగా, ఈ పిటిషన్ ఇప్పుడు సుప్రీం న్యాయమూర్తుల్లో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles