Karti Chidambaram Sent To Tihar Jail Till March 24 తీహార్ జైలుకు కార్తి చిదంబరం.. 12 రోజులు జ్యూడీషియల్ కస్టడీ..

Inx media case karti chidambaram sent to tihar jail for 12 days

cbi, Central Bureau of Investigation, INX Media case, Karti Chidambaram, P Chidambaram, tihar jail, home food, seperate cell, trending news, crime

A trial court on Monday sent Karti Chidambaram, the son of former Union minister P Chidambaram, to 12-day judicial custody in the INX Media case.

తీహార్ జైలుకు కార్తి చిదంబరం.. 12 రోజులు జ్యూడీషియల్ కస్టడీ..

Posted: 03/12/2018 05:28 PM IST
Inx media case karti chidambaram sent to tihar jail for 12 days

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదర్కోంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి 12 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ విధించింది ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం. దీంతో మాజీ కేంద్రమంత్రి తనయుడిని పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 24 వరకూ ఆయన తీహార్ జైలులోనే రిమాండ్ ఖైదీగా వుండనున్నారు. కాగా, జైలులో ప్రత్యేక సెల్ ఏర్పాటును కో్రుతూ కార్తి చిదంబరం తరపు న్యాయవాది యాయాన్ కృష్ణన్ వేసిన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో పాటు ఇంటి బోజనం వసతిని కల్పించాలని పిటీషన్ ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.
 
కాగా, పి. చిదంబరం కేంద్రమంత్రిగా వ్యవహరించిన సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తలదూర్చి లాభాలను అర్జించారన్న అరోపణలపే కార్తీ చిదంబరాన్ని విచారిస్తున్న సిబిఐ అయనపై అభియోగాలను నమోదు చేసి కోర్టులో సమర్పించిన నేపథ్యంలో కార్తీ చిదంబరానికి 12 రోజుల పాటు అనగా ఈ నెల 24 వరకు న్యాయస్థానం జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అయితే చిదంబరం కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో అనేక మంది ఉగ్రవాదాలను ప్రాసిక్యూట్ చేయడం జరిగిందని, దీంతో కార్తీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది దయన్ కృష్ణన్ కోర్టుకు విన్నవించారు.

కార్తీకి జైలులో ప్రత్యేక సెల్, ప్రత్యేక బాత్ రూమ్ కేటాయించాలని న్యాయస్థానాన్ని విన్నవిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. 'ముప్పు అనేది ఉంది. పిటిషనర్ (కార్తీ) కాంగ్రెస్ సభ్యుడు కూడా. అందువల్ల ఆయనకు జైలులో తగిన రక్షణ కల్పించాలి' అని కోరారు. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముప్పు అనేది చిదంబరానికి ఉండొచ్చు కానీ ఆయన కుమారుడికి కాదన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కార్తీ చిదంబరానికి ఎలాంటి ప్రత్యేక సెల్ కానీ, బాత్ రూమ్ కానీ, ఇంటి బోజన వసతినికి కానీ కల్పించేందుకు నిరాకరించింది. కాగా గత ఫిబ్రవరి 29న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీని అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cbi  INX Media case  Karti Chidambaram  P Chidambaram  tihar jail  crime  

Other Articles