mega farmers protest in New Delhi in April సీఎం లిఖితపూర్వక హామీతో.. రైతన్న దీక్ష విరమణ..

Maha kisan leaders say no compromise fadnavis feels positive about demands

All India Kisan Sabha, Azad Maidan, BJP, Devendra Fadnavis, Maharashtra, Mumbai, mumbai farmers' protest, mumbai farmers' protest, Nashik, Shiv Sena, Vidhan Bhavanlive news, Akhil Gogoi, loan waiver, poor tribals, shiv sena, latest news

The government’s anti-farmer stand needs to be challenged. State farmer heads are in close collaboration and we are planning to hold a big protest in New Delhi sometime in April. Farmers from all over India will be present in that rally. ," said Akhil Gogoi,

ITEMVIDEOS: కదం తొక్కిన ‘మహా’ రైతన్న.. దిగివచ్చన్.. ఏప్రిల్ లో హస్తినకు సెగ..

Posted: 03/12/2018 04:00 PM IST
Maha kisan leaders say no compromise fadnavis feels positive about demands

మహారాష్ట్రలో కర్షకలు కదం తొక్కారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కాలినడకన దాదాపు 180కిలోమీటర్లు ప్రయాణించి దేశ అర్థిక రాజధానికి చేరకున్న రైతన్న శాంతింపజేసేందుకు ప్రభుత్వం చేసిన యత్నాలు విఫలమయ్యాయి. నాసిక్ నుంచి వచ్చిన అన్నదాతలలో సుమారు 80 శాతం మంది అదివాసీలేనని, వారికి అటవీ భూమిని అసైన్ చేయాలని, వారు ఆ భూమిని సాగుచేసుకుంటామన్న డిమాండ్ చేస్తున్నారని, అయితే వారి సమస్యలను పరిష్కరించడానికి అరుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశామని ఇవాళ మధ్యహ్నం వరకు చెప్పుకోచ్చిన దేవేంద్ర ఫడ్నావిస్ ప్రభుత్ం ఎట్టకేలకు దిగిదవచ్చింది.

ఇప్పటికే రైతు డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించి.. వారు రోజుకు 30 కిలీమీటర్ల చొప్పున సుమారుగా 180 కిలోమీటర్ల దూరం నడిచేలా చేసిన మహారాష్ట్రలోని బీజేపి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, చివరి నిమిషంలో కూడా రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాల్సిన ముఖ్యమంత్రి అదివాసీలే అధికంగా వున్నారని వ్యాఖ్యాలు చేయడంలో.. రైతు సంఘాలు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో చర్చలకు ససేమిరా అన్నారు.

చివరాఖరకు స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నావిస్ నేతృత్వంలోనే కమిటి రైతు సమస్యల పరిష్కారానికి సుముఖంగా వుందని మహారాష్ట్ర మంత్రులు రైతు సంఘాల నాయకుల వద్దకు వచ్చి చెప్పడంలో రైతు సంఘాల అఖిలపక్షం నేతలు చర్చలకు వెళ్లారు. కాగా, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా హామీలను నెరవేరుస్తామని చెప్పిన రైతు సంఘాల నాయకులు వెనక్కు తగ్గలేదు. కాగా, రైతు రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నావిస్ లిఖిత పూర్వక హామీని ఇవ్వడంతో రైతు సంఘాల నేతలు శాంతించారు. తమ ధర్నాను విరమించుకున్నారు.

కాగా అందోళనలో భాగంగా ముంబయికి చేరుకున్న అన్నదాతలకు నగరవాసులు నుంచి మద్దతు లభించింది. మండుటెండలో వారం రోజుల పాటు నడుస్తూ ముంబయికి చేరుకున్న అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం లభించింది. వారికి మంచినీటి ప్యాకెట్లు, తినుబండారాలను నగరవాసులు, పలు స్వచ్చంధ సంస్థలు అందజేశాయి. కొన్ని కుటుంబాలు మొత్తం యాత్రలో పాల్గొన్నాయి. మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారి డిమాండ్లు నెరవేరాలని కోరుకుంటున్నామని, నగరవాసులు రైతన్నలకు అండగా నిలిచారు. రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా వారికి కూడళ్ల వద్ద నీళ్లు, తినుబండారాలను పంచారు.

వామపక్ష అనుబంధ సంఘమైన అఖిల భారత కిసాన్‌ సభ ఆధ్వర్యంలో రైతులు ముంబైకి చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వంలో అంధోళన రేకెత్తింది. కాగా రోజుకి 30 కిలోమీటర్లు నడిచిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కాంక్రీట్ రోడ్లపై నడవటంతో రైతన్నల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. చాలా మందికి మడెం దగ్గర బాగా పగుళ్లు వచ్చాయి. మరికొందరికి పుండ్లు పడ్డాయి. ఓ వైపు రక్తపు గాయాలు తమను అడ్డుకుంటున్నా.. తమ అడుగులు మాత్రం ముందుకే సాగుతున్నాయి. తాము ఎదుర్కోంటున్న కష్టాల ముందు గాయాలు పెద్దవి కాదని రైతన్నలు తమ అవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తిగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, మహారాష్ట్రలో కదిలిన రైతుల ర్యాలీ కేవలం అరంభం మాత్రమేనని, త్వరలోనే హస్తినకు కూడా తమ అందోళనను చాటుతామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, అందుకు వ్యతిరేకంగా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, సహా పలు రాష్ట్రాల నుంచి రైతులను సమీకరించి హస్తినలో మెగా ధర్నా చేపడతామని ఈశాన్య రైతు సంఘం నేత అఖిల్ గొగోయ్ అన్నారు. అంతకుముందు అస్పాంలోనే రైతు భేరిలో ఈశాన్య రైతుల డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా చేయనున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles