Telangana assembly and council suspends congress members కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వం రద్దు.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్..

Komatireddy sampath expelled from ts assembly and 11 mlas suspended for session

ESL Narasimhan, Governor Narasimhan, swamy goud, congress, congress MLAs, Congress MLCs, komatireddy venkat reddy, Sampath, Telangana, Telangana Legislative Assembly, Telangana Legislative Council, council chairman, swamy goud eye injured, budget session, Narasimhan budget speech, swamy goud, congress, komatireddy venkat reddy, Telangana News, Telangana politics

Congress MLA Komatireddy Venkat reddy and sampath were disqualified as they threw his headphones away, opposing the governor’s speech, which unfortunately, hit Legislative Council Chairman Swamy Goud, and his eye got injured. In this regard speaker and council chairman suspends congress mlas and mlcs uptill budget session.

ITEMVIDEOS: కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వం రద్దు.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్..

Posted: 03/13/2018 10:02 AM IST
Komatireddy sampath expelled from ts assembly and 11 mlas suspended for session

తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో విఫక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలోని మైక్ విరగొట్టి దానిని గవర్నర్ పై విసిరే క్రమంలో అది కాస్తా అదుపు తప్పి శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కుడి కంటికి తగిలిన విషయం తెలిసిందే.

దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటుగా మరో కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్ ల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాలపై వేటు వేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించింది. ఇక సభలో గంధరగోళం సృష్టించిన 11 మంది కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, పద్మవతిరెడ్డి, చిన్నారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జీవన్ రెడ్డి, డీకే అరుణ, మాదవ్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డీలను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు సభ అమోదించింది.

అటు మండలిలోనూ కాంగ్రెస్ సభ్యులను సస్సెండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీర్మాణాన్ని ప్రవేశపెట్టగా, స్వామి గౌడ్ స్థానంలో సభా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తాత్కాలిక మండలి చైర్మన్ హోదాలో నేతి విద్యాసాగర్ రావు షబ్బీర్ అలి, పోంగులేటి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆకుల లలితలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ఇంత అసహనం పనికిరాదని అన్నారు.

తాము తీసుకున్న నిర్ణయం కఠినమైనదే అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభలో, సభ బయట అవలంభిస్తున్న తీరు సిగ్గు చేటని అన్నారు. గత నాలుగేళ్లుగా తనపై అసత్య ప్రచారాలను చేస్తున్నారని, సీఎం కేసీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. అరచక శక్తుల పీచమణచడానికి ఎంతటి కఠిన చర్యలనైనా తీసుకుంటామని అన్నారు. రాజకీయ నేతల ముసుగులో అరాచక శక్తులను అగడాలను సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles