devotees throng shivalayaas కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. మార్మోగుతున్న శివనామస్మరణలు

Rush of devotees at srisailam and other siva temples

Siva temples, Telugu states, devotees, Sivaratri, Srisailam, Srikalahasti, Vemulawada, Pithapuram, Yaganti, Mahanandi, keesara, beeramguda, pancharama kshetralu, Sarvadarshanam , Srisailam temple, District Collector, Satyanarayana, Srisailam EO, Narayan Bharath Gupta, security arrangements, devotees

Siva temples in both Telugu states were teeming with devotees, who have been visiting the temples in large numbers to celebrate Sivaratri.

ITEMVIDEOS: కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. మార్మోగుతున్న శివనామస్మరణలు

Posted: 02/13/2018 10:24 AM IST
Rush of devotees at srisailam and other siva temples

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవ క్షేత్రాలు వేకువ జామునుంచే భక్తులతో కిటకిటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలుగా ప్రసిద్ది చెందిన పంచారామ క్షేత్రాలకు భక్తుల రద్దీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ప్రధాన శైవక్షేత్రాలతో పాటు అన్ని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గంగాజల, క్షీర, పంచామృత అభిషేక ప్రియుడైన శివయ్యకు ప్రత్యేకంగా నిర్వహించే అభిషేక కార్యక్రమాల్లో భక్తులు పాల్గోంటున్నారు. ఇవాళ అర్థరాత్రి జరిగే లింగోద్భవ పూజ కార్యక్రమాల సందర్భంగా కూడా తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. బిల్వార్ఛణ, కల్యాణం కార్యక్రమాల్లో కూడా పాల్గోనేందుకు భక్తుల అసక్తి కనబరుస్తున్నారు.

ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, అమరావతిలతో పాటు భీమేశ్వరం, కాళేశ్వరం తదితర శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంది. వేకువ జామునుంచే తెలుగు రాష్ట్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు కనిపిస్తున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తిలో  శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత సోమస్కంధమూర్తి భక్తులను అనుగ్రహిస్తున్నారు. కోటప్పకొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. సుమారు 20కి పైగా భారీ ప్రభలు త్రికోటేశ్వరుని ముందు కొలువుదీరాయి. ఇటు నగరంలోని కీసర అలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అటు బీరంగూడలోని శ్రీభ్రమారాంభికా మల్లిఖార్జున దేవాలయంలో కూడా భక్తులు పోటెత్తారు.

కాగా, కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రి మాత్రం వెలవెలబోతోంది. కొండపై ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు జరగడం లేదు. కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులలో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్దరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. ఆలయ పనులు శివరాత్రి నాటికి పూర్తి చేయాలని అధికారులు తొలుత భావించినప్పటికీ, అవి పూర్తి కాలేదు. దీంతో ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు రద్దయ్యాయి. విషయం తెలియక కొండపైకి వస్తున్న భక్తులు మల్లన్న దర్శనం లేకుండానే ఉసూరుమంటూ వెనక్కు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles