Chandrababu is richest CM, Manik Sarkar poorest: Report తెలుగు ‘చంద్రుల’ రికార్డు.. సంపన్న సీఎంలుగా టాప్

Chandrababu naidu richest chief minister in india eleven others face criminal cases

criminal cases, Association for Democratic Reforms, richest Chief Ministers, Indian CMs, criminal cases on CM's, National Election Watch, hief ministers, Criminal Case, Crorepatis, Crorepatis chief ministers, chief ministers with criminal cases, Chandrababau, Pema Khandu, ADR report, Election affidavits, Amarinder Singh, richest CMs

Eleven chief ministers have criminal cases registered against them and 25 are crorepatis, said a report. Andhra Pradesh CM Chandrababu Naidu is the wealthiest chief minister with declared assets of Rs. 177 crore.

తెలుగు ‘చంద్రుల’ రికార్డు.. సంపన్న సీఎంలుగా టాప్

Posted: 02/13/2018 11:12 AM IST
Chandrababu naidu richest chief minister in india eleven others face criminal cases

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంపన్న సీఎం లో టాప్ లిస్టులో చేరిపోయారు. యావత్ భారతావనిలోని 29 రాష్ట్రాలలో మన ముఖ్యమంత్రులు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. ఇటు నిత్యం అభివృద్ది ప్రసంగాలు చేసే ముఖ్యమంత్రులు అటు క్రిమినల్ కేసులలోనూ.. మరోవైపు సంపన్న సీఎంల జాబితాలోనూ వారు సత్తాను చాటుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్యూ సంస్థలు సంయుక్తంగా జరిపిన పరిశీలనలో ఈ మేరకు పలితాలు వెల్లడయ్యాయి. దేశంలోని 29 రాష్ట్రాలు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి మొత్తంగా 31 మంది ముఖ్యమంత్రుల పై జరిపిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఘనత మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే దక్కించుకుని రికార్డు సృష్టించారు. ఆయన మొత్తం (స్థిర, చర) ఆస్తుల విలువ సుమారు రూ.177 కోట్లని సర్వే స్పష్టం చేసింది. ఇక ద్వితీయ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఏకంగా రూ.129 కోట్ల అస్తులతో నిలచారు. రూ. 48 కోట్ల అస్తులతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మూడో స్థానాన్ని ఆక్రమించాగా.. రూ.15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాలుగో స్థానంలో నిలిచారు.

దేశంలోని అత్యంత పేద ముఖ్యమంత్రుల్లో మాత్రం మళ్లి త్రిపుర సీఎం మాణిక్ సర్కారే నిలిచారు. కేవలం 26 లక్షల రూపాయల అస్తులతో ఆయన పేద ముఖ్యమంత్రుల జాబితాలో తొలి స్థానంలో ఉండగా, ఆ తరువాత దీదీ రెండోస్థానంలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం పాలన సాగిస్తున్న మమతా బెనర్జీ పేరున ఇప్పటికే కేవలం రూ.30 లక్షలను మాత్రమే వున్నాయి. అయితే మమతా బెనర్జీ వద్ద రూపాయి విలువైన స్థిరాస్తి కూడా లేకపోవడం విశేషం. ఇక జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో ఉన్నారు. ముఫ్తీ ఆస్తుల విలువ రూ.55 లక్షలని ఏడీఆర్ పేర్కొంది.

మొత్తం దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులలో బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తరువాతి స్థానంలో కేరళ మఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పది కేసులు నమోదయ్యాయి.

దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో నేర చరిత్ర లేని ముఖ్యమంత్రులుగా ఇరవై మంది వుండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులిద్దరూ కూడా నేరచరిత్రులు గల వారి జాబితాలోనే స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబుపై మూడు కేసులు నమోదు కాగా అవి అంత తీవ్రమైన కేసులు మాత్రం కాదు. కాగా, కేసీఆర్‌పై నమోదైన రెండు కేసులలో ఒకటి మాత్రం క్రిమినల్ కేసు. ఇక మొత్తంగా దేశంలోని 11 మంది ముఖ్యమంత్రులపై వివిధ రకాల కేసులు ఉన్నాయి. వీటిలో 8 మందిపై మాత్రం(26 శాతం) అత్యంత తీవ్రమైన కేసులు నమోదై వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Haneesha chowdary suicide case

  హనీషా అందుకే సూసైడ్ చేసుకుందా?

  Feb 19 | హైదరాబాద్ లో విద్యార్థిని హనీషా చౌదరి(24) ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ హనీషా చౌదరి ఎంబీఏ... Read more

 • Congress mla harris son mohammed nalapad surrenders in bengaluru pub brawl case

  36 గంటల తరువాత పోలీసులకు లొంగిపోయిన ఎమ్మెల్యే తనయుడు

  Feb 19 | తాను ఎమ్మెల్యే తనయుడిని అన్న అహంకారం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ యువకుడికి.. తన అధికార పక్షం కూడా తనను శిక్ష నుంచి కాపాడలేదని తెలియడం.. ఇక స్వయంగా ముఖ్యమంత్రే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా... Read more

 • Young and dynamic warangal collector amrapali got married

  కాశ్మీరీ సంప్రదాయంలో కలెక్టర్ అమ్రపాలి కల్యాణం

  Feb 19 | వరంగల్ అర్బన్ జిల్లా డైనమిక్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి కల్యాణం కమనీయంగా సాగింది. సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో మెరిసినపోయిన కలెక్టరమ్మ, గోవా ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ పరిణయం.. జమ్మూ కాశ్మీర్ లో వైభవంగా... Read more

 • Plane crash kills passengers in iran

  ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

  Feb 18 | ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి... Read more

 • Rgv attended before ccs police

  ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

  Feb 17 | వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల... Read more

Today on Telugu Wishesh