man kidnapped by tamil actor కిడ్నాప్ కేసులో నటుడు హరి అరెస్ట్

Actor surrenders in court in school correspondent kidnap case

Hari, Chennai police, Senthil Kumar, Adarsh Matriculation Higher Secondary School, Vaniyambadi, Udayachandran, Priya, kidnappings in Chennai, George Town magistrate court, Vellore police, Kollywood, Tamil Nadu, crime

A small-time Tamil film actor has surrendered himself before a court in Chennai, in connection with the kidnap of a school correspondent at Vaniyambadi in Vellore district.

కిడ్నాప్ కేసులో నటుడు హరి అరెస్ట్

Posted: 02/02/2018 07:32 PM IST
Actor surrenders in court in school correspondent kidnap case

కిడ్నాప్ కేసులో ప్రమేయం వున్న కాలీవుడ్ నటుడ్ని పోలీసు అరెస్టు చేశారు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేసిన కేసులో తమిళ నటుడు హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని వాణియంబాడి టీచర్స్ కాలనీకి చెందిన సెంథిల్ కుమార్ ఆదర్శ్ మాట్రిక్ స్కూల్ లో కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. జనవరి 19న ఆయన బైక్ పై వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేశారు.

ఆ తర్వాత కాసేపటికి తన అన్నయ్య ఉదయచంద్రన్ కు సెంథిల్ ఫోన్ చేసి, తాను కిడ్నాప్ కు గురైనట్టు చెప్పారు. తనను విడిచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని ఉదయచంద్రన్ వెంటనే పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత రూ. 50 లక్షల నగదు తీసుకుని కారిమంగళం అనే ప్రాంతానికి ఉదయచంద్రన్ వెళ్లారు. పోలీసులు కూడా అతనిని వెంబడించారు.

ఈ నేపథ్యంలో, కిడ్నాపర్లు ఉపయోగించిన కారు ఆధారంగా రెడ్ హిల్స్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణలో అసలు సూత్రధారి నటుడు హరి అని తేలింది. పలు సినిమాల్లో అతను విలన్ గా నటించాడు. ఓ జిమ్నాస్టిక్ సెంటర్ కూడా నడుపుతున్నాడు. హరి భార్య ప్రియ గత 12 ఏళ్లుగా సెంథిల్ కుమార్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో, సెంథిల్ ను హరి కిడ్నాప్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hari  Priya  Senthil Kumar  Adarsh School  kidnap  court  Vellore  Chennai police  Kollywood  Tamil Nadu  crime  

Other Articles