Amit Shah Clarity to Andhra BJP Leaders over TDP టీడీపీతో మిత్రబంధంపై అమిత్ షా క్లారిటీ

Amit shah clarity to andhra bjp leaders over tdp

General elections 2017, AP Special status, polavaram project, bjp, Congress, TDP, Chandrababu Naidu, YS Jagan, YSRCP, Narendra Modi, Andhra Pradesh, state bifurfication bill, parliament, election promises, politics

Amit Shah has given full clarity to AP BJP Leaders about the approach they need to adopt after facing criticism from all ends over injustice to the capital-less state in Union Budget 2018.

టీడీపీతో మిత్రబంధంపై అమిత్ షా క్లారిటీ

Posted: 02/02/2018 03:48 PM IST
Amit shah clarity to andhra bjp leaders over tdp

ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ ప్రభుత్వంతో తమ మైత్రి కొనసాగుతుందని ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి తొందరపాటు వ్యాఖ్యలను చేయకూడదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లేందుకే నిర్ణయించుకున్నామని, కాబట్టి మిత్ర ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలుగురాష్ట్రాల బీజేపి అధ్యక్షులు, ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ అయ్యారు.

సుమారు గంటన్నరపాటు జరిగిన భేటీలో పలు విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై నేతలకు స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీ చేస్తామని, ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండబోదని నేతలకు తేల్చి చెప్పారు. మిత్రధర్మానికి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని సొంత పార్టీ నేతలను షా హెచ్చరించారు. టీడీపీతో దోస్తీ కటీఫ్ అంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అమిత్ షా ఈ రకంగా తెరదించారు.

విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడుతూ ఈ విషయంలో ఒడిశాతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య ఉండదని పేర్కొన్న అమిత్ షా.. నాబార్డు రుణాలు ఇస్తున్నందు వల్లే బడ్జెట్‌లో పోలవరం గురించి ప్రస్తావించలేదని వివరించారు.

అయితే అదే సమయంలో టీడీపీ నేతలు కేంద్రప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని కూడా సూచించారని సమాచారం. టీడీపీ నేతలను చూసి బెదరవద్దని.. కేంద్రంలోని ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని కూడా ఆయన పేర్కొన్నారు. టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపట్ల బీజేపి పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు అమిత్ షా దృష్టికి ఆ విషయాలను తీసుకురావడంతో.. ఆయన ఈ విధంగా సూచించారని సమాచారం.

అంధ్రప్రదేశ్ అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నామని చెప్పిన అమిత్, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, టీడీపీ విమర్శలకు దీటైన జవాబులు ఇవ్వాలని సూచించారు. అమరావతికి సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రోగ్రసివ్ రిపోర్ట్)ను ఇప్పటివరకూ ఇవ్వకపోయినా, నిధులను మాత్రం అందిస్తూనే ఉన్నామని గుర్తు చేసిన అమిత్ షా, అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలోనూ బీజేపీ నేతల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని, ఈదఫా రాయలసీమలో తన పర్యటన ఉంటుందన్న సంకేతాలను ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Andhra Pradesh  state bifurfication bill  parliament  election promises  politics  

Other Articles