special treatment to asi mohan reddy in karimnagar jail జైలు నుంచి సెటిల్మెంట్లు.. రౌడీగా మారిన పోలీసు

Asi mohan reddy continues call money business and settlements from jail

asi mohan reddy, karimnagar jail, special treatment, call money, private school director suicide, big racket in call money, mohan reddy call money racket

asi mohan reddy, who was arrested in call money case is continuing his business uninteruptedly and doing settlements from karimnagar jail using jail head room for this purpose.

ITEMVIDEOS: తమ గూటి పక్షికి.. జైలులోనూ రాచమర్యాదలు..

Posted: 11/17/2017 12:10 PM IST
Asi mohan reddy continues call money business and settlements from jail

తమ గూటికి చెందని పక్షి.. అందులోనే అక్రమంగా డబ్బులు సంపాదించిన వ్యక్తి.. ఇక దీనికి తోడు పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నుంచి బలమైన మనీ సంబంధాలు వున్న వ్యక్తి.. తన పాపాలు బయటపడటంతో జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే ఆయన సలిపిన పాపాలపై ఏకంగా ఓ కమిటీయే ఏర్పడిందంటే ఆయనగారి పాపాల చిట్టా ఎంత పెద్దదో మనకు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంతటి వ్యక్తి జైలులో ఎలా వున్నాడా..? అని అలోచన మీకు కలిగిందా...?

అలా కలిగితే మాత్రం పోరబాటే. ఎందుకంటే ఈయన గారికి జైలు కూడా ఓ అతిథి గృహంలా మారిపోయింది. ఆయనకు జైలు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు. ఎంతాలా అంటే ఏకంగా తనను కలిసేందుకు వచ్చే కుటుంబసభ్యులు, ఇతరులతో తాను రహస్యంగా మాట్లాడేందుకు జైలు సూపరిండెంట్ గదినే వినియోగించుకుంటున్నాడు. మరోలా చెప్పాలంటే పోలీసుల అవతారాన్ని చాలించిన ఈ నిందితుడు ఏకంగా పక్క డాన్ అవతారాన్ని ఎత్తి.. జైలు నుంచే తన వ్యాపారాలు, దందాలు అన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.

ఇంకోలా చెప్పాలంటే ఈ నిందితుడికి జైలు మరింత స్వేచ్ఛను కల్పించినట్లు వుంది. పలు దందాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు, సెటిల్ మెంట్లు చేసి చివరాఖరుకు ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడి ఆత్మహత్యకు కూడా కారణమైన ఓ నిందితుడ్ని పట్ల పోలీసులు సర్వసాధారణంగా ఎలా వ్యవహరిస్తారో అలా కాకుడపాల్పడి, రాచమర్యాదలు కల్పించి అడ్డంగా దొరికిపోయారు, ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఏఎస్ఐ మోహన్ రెడ్డి ములాఖత్ ల మాయాజాలానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

జైల్లో సూపరింటెండెంట్ గదిలో రాచమర్యాదలు అందుకుంటున్న ఆయన అక్కడి నుంచే సెటిల్ మెంట్లు సాగిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. సూపరింటెండెంట్ గదిలో దర్జాగా సోఫాలో కూర్చుని, తన భార్య, కుటుంబీకులతో కలసి మోహన్ రెడ్డి సెటిల్ మెంట్లు చేస్తున్న దృశ్యాలు బయటకు లీక్ అయ్యాయి. జైలు ఉద్యోగి రహస్యంగా తన మొబైల్ ఫోన్ లో తీసిన వీడియో.. తెలంగాణ పోలీసులు దేశంలోనే ఉన్నతమైన పోలీసులు అని చెప్పుకుంటున్న వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నాయి.

అక్రమాలు,, అక్రమార్జనలు, వడ్డీల పేరుతో ప్రజలు అసువులు తీసిన నిందితుడు ఇప్పటికే అవి చేసిన జైలు జీవితం గడుపుతున్నానని.. ఇప్పటికైనా తాను చేసిన తప్పులకు, పాపాలకు ఇక్కడే ప్రాయశ్చిత్తం అనుభవించి.. సన్మార్గంలో నడుస్తానని పూనుకోవాల్సింది పోయి మరిన్ని సెటిల్ మెంట్లు, అక్రమ దందాలకు జైలు నుంచే పూనుకోవడం ఎంతవరకు సమంజసం. కాగా దీనిపై అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలంగాణ జైళ్ల శాఖ ప్రకటించినప్పటికీ, మోహన్ రెడ్డి సెటిల్ మెంట్లు సాగుతున్న తీరు, జైళ్లలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles