PMAY tweak makes MIG homes more affordable ఇల్లు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

Centre increases carpet area of houses under pradhan mantri awas yojana

Middle Income group, Pradhan Mantri Awas Yojana, NAREDCO, CREDAI, Carpet areas, PM Awas Yojana, houses, Middle income group (MIG), GST Rate, Gst Tax Rate, Revised GST Tax rates, India

The Centre today approved the enhancement of the carpet area of houses for the middle-income group (MIG) category under the Pradhan Mantri Awas Yojana- Urban (PMAY-U), a move hailed by realtors' bodies CREDAI and NAREDCO.

ఇల్లు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

Posted: 11/17/2017 11:56 AM IST
Centre increases carpet area of houses under pradhan mantri awas yojana

ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా...? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మీకు దాదాపుగా రెండు లక్షల 67 వేల రూపాయల రాయితీ లభించనుందని తెలుసా..? ఈ విషయం మాకు తెలుసులేండీ అనే వాళ్లకు కూడా మరో శుభవార్త. అదేమింటంటే.. ఫలానా కార్పెట్ ఏరియాకు ఫలానా రాయితి అంటూ గతంలో ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు ఏకంగా కార్పెట్ ఏరియాను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కిందకు మరికొంతమంది లభ్దిదారులు చేరే అవకాశం కల్పించింది.

ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద మధ్య తరగతి ఆదాయ గ్రూప్‌(ఎంఐజీ) ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తుంది. 2017 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ఎంఐజీ-1 కేటగిరీ కింద గృహాల కార్పెట్‌ ఏరియాను 90 చదరపు మీటర్ల నుంచి 120 చదరపు మీటర్లకు పెంచారు. ఎంఐజీ-11 కేటగిరీ కింద ప్రస్తుతమున్న కార్పెట్‌ ఏరియా 110 చదరపు మీటర్లను 150 చదరపు మీటర్లకు పెంచినట్టు తెలిసింది. ఎంఐజీ-1 కేటగిరీ కింద రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారికి రూ.9 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది.

అదేవిధంగా ఈ లబ్దిదారులకు 4 శాతం వడ్డీ రాయితీలు అందుతాయి. ఎంఐజీ-2 కేటగిరీ కింద రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారి రూ.12 లక్షల వరకు రుణాన్ని 3 శాతం వడ్డీ రాయితీలతో అందించనున్నారు. 2022 నాటికి అందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కార్పెట్ ఏరియా ఇంట్లో గదుల్లోని గచ్చు పరిధి వరకు విస్తరించిన ప్రాంతం. గోడలను మినహాయించి దీన్ని లెక్కిస్తారు. బిల్డర్లు ప్రస్తుతం సూపర్‌ బిల్డప్‌ ఏరియాకు కలిపి కొనుగోలుదారులకు ఛార్జీలు వేస్తున్నారు. కానీ రెరా దీనికి వ్యతిరేకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles