bank of baroda specialist officers recruitment బ్యాంక్ అప్ బరోడాలో స్పెషలిస్ట్ అఫీసర్ల ఉద్యోగాలు..

Bank of baroda specialist officers recruitment

govt. jobs, bank jobs, ssc jobs, govt. jobs for today, bank jobs for today, Top Government jobs for today, bank of baroda jobs, bank of baroda specialist officers jobs, eligible candidates for bank jobs, bank job aspirants

Bank of Baroda has invited online application for recruitment of specialist officers. Eligible candidates can send their applications from November 14, 2017

బ్యాంక్ అప్ బరోడాలో స్పెషలిస్ట్ అఫీసర్ల ఉద్యోగాలు..

Posted: 11/17/2017 12:52 PM IST
Bank of baroda specialist officers recruitment

ఇండియస్ ఇంటర్నేషనల్ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది .

* పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్
* మొత్తం పోస్టుల సంఖ్య: 427


విభాగాల వారీగా ఖాళీలు:


హెడ్ క్రెడిట్ రిస్క్ (కార్పొరేట్ క్రెడిట్)-1, హెడ్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్-1, ఐటీ సెక్యూరిటీ- 5, ట్రెజరీ డీలర్స్/ట్రేడర్స్- 3, ట్రెజరీ రిలేషన్‌షిప్ మేనేజర్- 2.

..ట్రెజరీ ప్రొడక్ట్ సేల్స్- 20 (ఎంఎంజీ స్కేల్-2)
..అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్). బ్యాంక్/మ్యూచివల్ ఫండ్, ఇన్వెస్టిమెంట్ బ్యాంకింగ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
..ఫైనాన్స్/క్రెడిట్- 40 (ఎంఎంజీ స్కేల్-3)
..అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ లేదా ఫైనాన్స్‌లో పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. బ్యాంకింగ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
..ఫైనాన్స్/క్రెడిట్- 140 (ఎంఎంజీ స్కేల్-2)
..అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ లేదా ఫైనాన్స్‌లో పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. ఏదైనా ఫైనాన్స్/క్రెడిట్‌కు సంబంధించిన క్రెడిట్ ప్రాసెసింగ్/క్రెడిట్ అప్రైజల్, బ్యాంక్ రుణాల మంజూరు, పర్యవేక్షణలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
..వయస్సు: 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
..ట్రేడ్ ఫైనాన్స్- 50 (ఎంఎంజీ స్కేల్-2)
..అర్హత: సీఏ లేదా ఎంబీఏ లేదా పీజీ/పీజీ డిప్లొమా (ఫైనాన్స్, ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్)లో ఉత్తీర్ణత. రెండేండ్ల అనుభవం.
..వయస్సు: 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
..సెక్యూరిటీ- 15 (ఎంఎంజీ స్కేల్-2)
..అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ రంగంలో ఆఫీసర్ స్థాయిలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
..వయస్సు: 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
..సేల్స్- 150 (జేఎంజీ స్కేల్-1)
..అర్హత: ఎంబీఏ లేదా పీజీ/పీజీ డిప్లొమా (మార్కెంటింగ్, సేల్స్/రిటైల్)లో ఉత్తీర్ణత. బ్యాంక్/ఎఫ్‌ఎంసీజీ/ఎన్‌బీఎఫ్‌సీ, డీసీఏలో ఏడాది అనుభవం ఉండాలి.
..వయస్సు: 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
..పే స్కేల్: జేఎంజీ స్కేల్1, ఎంఎంజీ (స్కేల్-2, 3), ఎస్‌ఎంజీ (స్కేల్-4, 5) ఆఫీసర్ పోస్టులకు డీఏ, స్పెషల్ అలవెన్స్‌లు, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలు కలుపుకొని సుమారుగా రూ. 66,000, 81,000, 1,00,000, 1,21,000, 2,35,000/- జీతం ఉంటుంది.
..ప్రొబేషన్ పీరియడ్: 12 నెలలు
..అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.100/-)
..ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్ + పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా.
..స్కేల్- 1 పోస్టులకు ఆన్ లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
..స్కేల్- 2, 3, 4, 5 పోస్టులకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్‌డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

పరీక్ష విధానం:

..ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
..రీజనింగ్ (50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
..పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
..పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు తగ్గిస్తారు.
..దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
..ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: డిసెంబర్ 5
..వెబ్‌సైట్: www.bankofbaroda.co.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles